ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏజెంట్లు ఈ పని చేయాలి: చంద్రబాబు

ABN, Publish Date - May 12 , 2024 | 08:07 PM

రేపటి పోలింగ్‌పై పార్టీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం సమీక్ష చేశారు. పార్టీ అఫీస్‌లోని వార్ రూం నుంచి జిల్లాల్లోని పార్టీనేతలతో సమీక్షించారు.

Nara Chandrababu Naidu

అమరావతి: రేపటి పోలింగ్‌పై పార్టీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం సమీక్ష చేశారు. పార్టీ అఫీస్‌లోని వార్ రూం నుంచి జిల్లాల్లోని పార్టీనేతలతో సమీక్షించారు. పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల ప్రక్రియపై చంద్రబాబు సమాలోచనలు చేశారు. రేపటి పోలింగ్‌పై తీసుకోవాల్సిన చర్యలపై అటు పార్టీ నేతలకు, ఇటు వార్ రూం బృందానికి చంద్రబాబు సూచనలు, సలహాలు ఇచ్చారు.

వార్ రూంలో వివిధ విభాగాల సమన్వయం కోసం విడివిడిగా బాధ్యతల అప్పగించారు. గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశాన్ని మానిటర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వెళ్లేలా పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మరో 24 గంటలపాటు నాయకులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురైన సంసిద్ధంగా ఉండాలని టీడీపీ కేడర్‌కి చంద్రబాబు సూచించారు.


Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

నియోజకవర్గాల్లో పోలింగ్‌లో సమస్యలపై ఎప్పటికప్పుడు సెంట్రల్ వార్ రూంకు సమాచారం వచ్చేలా వ్యవస్థల ఏర్పాటు చేయాలని సూచించారు. డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ లెటర్లు, పుకార్లు, హింసా రాజకీయాలతో వైఎస్సార్సీపీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా పార్టీలో బాధ్యతల అప్పగించారు. జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అబ్జర్వర్ల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లడం ద్వారా తక్షణ చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొదించారు. వార్ రూం నుంచి పలు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ఏజెంట్లుగా వెళ్లే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. పోలింగ్ శాతం పెరిగేలా పార్టీ తరుపున ప్రయల్నించాలని నేతలకు అధినేత సూచించారు.


ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని.....ఓటర్లు స్వేచ్ఛగా, సౌకర్యవంతంగా ఓటు వేసే పరిస్థితిని కల్పించాలని నేతలకు చంద్రబాబు చెప్పారు. ఓటమి భయంతో వైసీపీ ఊహంచని స్థాయి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, పూర్తి స్థాయి అప్రమత్తతో చివరి ఓటు పోల్ అయ్యేవరకు పనిచేయాలని తెలిపారు. పోలింగ్ పూర్తి అయ్యే వరకు గ్రామంలో కార్యకర్త నుంచి పార్టీ కార్యాలయంలో నేతల వరకు ఏ ఒక్కరూ రిలాక్స్ అవ్వడానికి వీల్లేదని అన్నారు. రేపు ఉదయం 7 గంటలకు ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం పార్టీ కార్యాలయంలోని వార్ రూంకు చంద్రబాబు రానున్నారు. రేపు సాయంత్రం పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు వార్ రూం నుంచి చంద్రబాబు మానిటర్ చేయనున్నట్లు సమాచారం.

Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 12:32 AM

Advertising
Advertising