AP Politics: సీఎం కార్యాలయానికి వచ్చింది పాంట్రీ కారో, ఫైనాన్స్ కారో..?: వర్ల రామయ్య
ABN, Publish Date - Mar 27 , 2024 | 06:55 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చిన కంటైనర్ వ్యవహారం తేల్చాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ ఇంటికి వచ్చిన కంటైనర్ వ్యవహారం తేల్చాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఇంటికి వచ్చిన కంటైనర్ వ్యవహారం తేల్చాలని తెలుగుదేశం పార్టీ (TDP) డిమాండ్ చేసింది. ఇదే అంశంపై డీజీపీకి (DGP) ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ (Jagan) ఇంటికి వచ్చిన కంటైనర్ వ్యవహారం తేల్చాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) కోరారు. ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చింది పాంట్రీ కారో, ఫైనాన్స్ కారో ఎన్నికల సంఘం తేల్చాలన్నారు.
తిరుపతి ఎయిర్ పోర్టు పక్కన ఉన్న గోదాముల్లో వైసీపీ ఉచితాల లోడ్ దిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. ఆ గోదాముల్లో కుక్కర్లు, ఫ్యాన్, వాచ్ ఉన్నాయని వివరించారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఎమ్మార్వో, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్‌కు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని వెల్లడించారు. పెద్దల వ్యవహారం అని తమ ఫిర్యాదును అధికారులు లెక్క చేయలేదని వర్ల రామయ్య అంటున్నారు. అందుకోసమే సీఈవోకు ఫిర్యాదు చేశామని వివరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Chandrababu: జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు.. మంత్రి రోజాపై చంద్రబాబు విసుర్లు
Updated Date - Mar 27 , 2024 | 06:55 PM