Pawan Kalyan: వైసీపీలో చాలా మంది నా అభిమానులు ఉన్నారు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 20 , 2024 | 08:54 PM
వైసీపీ(YSRCP)లో చాలామంది తన అభిమానులు ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన రాష్ట్రాన్ని పరిపాలించే మహారాణి వెళ్ళిపోవాలని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జక్కంపూడి కుటుంబం పై తనకు గౌరవం ఉందన్నారు. రాజానగరం నియోజకవర్గం గంజాయి, ఇసుక అక్రమ తవ్వకాలుకు అడ్డగా మారిందని ఆరోపించారు.
అమరావతి: వైసీపీ(YSRCP)లో చాలామంది తన అభిమానులు ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన రాష్ట్రాన్ని పరిపాలించే మహారాణి వెళ్ళిపోవాలని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జక్కంపూడి కుటుంబం పై తనకు గౌరవం ఉందన్నారు. రాజానగరం నియోజకవర్గం గంజాయి, ఇసుక అక్రమ తవ్వకాలుకు అడ్డగా మారిందని ఆరోపించారు. బలమైన బవిష్యత్తు ఇవ్వటానికి వచ్చానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ సర్వనాశనం అవుతుందని విరుచుకుపడ్డారు.
Atchannaidu: గులకరాయి డ్రామాకు దర్శకత్వం వహించినవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న వార్నింగ్
ప్రజలు ఆలోచించి ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. వైసీపీ ప్యాన్‌కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. దళిత డ్రైవర్‌ను హత్య చేసినందుకు చాలా కోపం వచ్చిందని అన్నారు. జక్కంపూడి కుటుంబం నుంచి వచ్చి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లను ప్రోత్సాహిస్తున్నారని విమర్శించారు. జగన్‌తో చెడు సాహవాసంతో జక్కంపూడి కుటుంబ సభ్యులు పాడైపోయారన్నారు.లే అవుట్లకు 15 శాతం కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. నన్నయ విశ్వవిద్యాలయం వీసీ పదవి ఇచ్చేందుకు కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. జక్కంపూడి దౌర్జన్యం పోవాలంటే జనసేనను గెలిపించాలని కోరారు.
AP Election 2024: గన్నవరంలో హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్
ఇసుక వ్యాపారం పైనే రూ. 100 కోట్లు సంపాదించారని ధ్వజమెత్తారు. వైసీపీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులు శిరోమండనం తరహాలోనే సీతానగరంలో దళిత యువకుడికి శిరోముండనం చేశారని విరుచుకుపడ్డారు. ఇళ్ల పట్టాలపై రూ.150 కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఇరిగేషన్ ఇంజనీర్‌పై దాడి చేశారని దుయ్యబట్టారు. కొండలు దోచేశారని.. చెరువుల్లో మట్టి అమ్మేసుకున్నారని చెప్పారు. తన భార్య క్రిష్టియన్ అని.. తనకు మతం, కులం ఉండదని స్పష్టం చేశారు.తనకు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు.
AP Elections: మంత్రి కాకాణి ఇలాకాలో భారీగా మద్యం డంప్... అధికారులు వెళ్లి చూడగా..!
తాను క్రిస్టియానిటీని గుండెళ్లో పెట్టుకున్నానని వివరించారు. 2007 లోనే జెరుసలేం వెళ్లానని.. క్రైస్తవులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనలాంటి వాడు తప్పు చేస్తే శిక్షించాలని అన్నారు. 30 వేల మంది మహిళలు అదృశ్యమయితే జగన్ తనపై పడి ఏడుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాట్లాడతానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Lokesh: జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!
Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 20 , 2024 | 09:24 PM