PM Modi: మాఫియా కోసం జగన్ సర్కార్ పనిచేస్తోంది: ప్రధాని మోదీ
ABN, Publish Date - May 08 , 2024 | 04:47 PM
పేదల వికాసం కాదు మాఫియా వికాసం వైసీపీ సర్కార్ పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
అన్నమయ్య: పేదల వికాసం కోసం కాదు.. మాఫియా వికాసం వైసీపీ సర్కార్ పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఐదేళ్లలో రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని.. వైసీపీ మంత్రులు గుండాగిరి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇక వారి ఆటలు సాగవని, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. ప్రధాని మోదీకి తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేశ్ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు.
జల్ జీవన్ మిషన్‌కు జగన్ సర్కార్ సహకరించలేదని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. శాండ్ మాఫియాతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని గుర్తుచేశారు. రాయలసీమలో అపార ఖనిజ సంపద ఉందన్నారు. పర్యాటక రంగానికి అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. పులివెందులలో అరటి రైతుల కోసం క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ ఇస్తామని స్పష్టం చేశారు.
గత పదేళ్లలో చేపట్టిన మంచి పనులను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తానని చెబుతోందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి తీసుకుంటానని చెబుతోంది. రామ మందిరానికి తాళం వేస్తానని అంటుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దేశాన్ని విభజిస్తూ మాట్లాడుతున్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన పనులతో భారతదేశానికి గల్ఫ్ దేశాల్లో గౌరవం పెరిగిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Read Latest AP News and Telugu News
Updated Date - May 08 , 2024 | 05:05 PM