ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: నామినేషన్ల పర్వంలో పోలీసుల అత్యుత్సాహం.. మీడియాకూ నో ఎంట్రీ..

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:27 PM

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు పలు చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నేతలు, అధికార గణం అండదండలతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు పలు చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నేతలు, అధికార గణం అండదండలతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోలీసులు ఓవరాక్షన్ తారాస్థాయికి చేరుకుంది. ఆర్డీవో భాగ్యరేఖ ఆదేశాలతో కఠిన ఆంక్షలు విధించారు. నామినేషన్ల సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లకుండా మీడియాను అడ్డుకున్నారు. నామినేషన్ల వేయడానికి వస్తున్న వారి ఫొటోలు, వీడియోలు తీయవద్దని అడ్డుకుంటున్నారు. ఆర్డీవో కార్యాలయాలకు వంద మీటర్ల దూరంలో మీడియా ఉండాలంటూ హుకుం జారీ చేయడం గమనార్హం. ఎన్నడు లేని విధంగా ఈసారి మీడియాకు ఆంక్షలు పెట్టడం ఏమిటని విలేకరులు మండిపడుతున్నారు.


Elections 2024: రామనవమి ఘర్షణలకు కారణం మమతే.. బీజేపీ స్ట్రాంగ్ ఆరోపణలు..

మరోవైపు.. పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన రెస్కో మాజీ చైర్మన్‌ శెట్టివారి రాజశేఖర్‌ టీడీపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లో టీడీపీ యువనేత నారా లోకేశ్‌ సమక్షంలో రాజశేఖర్‌ పసుపు కండువా కప్పుకున్నారు. రాజశేఖర్‌తో పాటు సుమారు 100 మంది ముఖ్య నేతలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీడీపీ తీర్థం తీసుకున్నారు. వారందరికీ లోకేశ్‌ పసుపు కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 12:27 PM

Advertising
Advertising