AP Elections: ఓటమి భయం వెంటాడుతుందా.. ప్రత్యర్థులపై అక్రమ కేసులకు కారణం అదేనా..?
ABN, Publish Date - May 14 , 2024 | 05:44 PM
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మెషిన్లలో లాక్ అయింది. జూన్4 ఓట్ల లెక్కింపుతో గెలిచేదెవరో తేలిపోనుంది. పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీకి చెందిన నాయకులే ప్రత్యర్థులపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా ఉండేందుకు దాడులకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీనే ఘటనలకు కారణమని ఆరోపిస్తోంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మెషిన్లలో లాక్ అయింది. జూన్4 ఓట్ల లెక్కింపుతో గెలిచేదెవరో తేలిపోనుంది. పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీకి చెందిన నాయకులే ప్రత్యర్థులపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా ఉండేందుకు దాడులకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీనే ఘటనలకు కారణమని ఆరోపిస్తోంది. పోలింగ్ ముగిసన తర్వాత వైసీపీ నాయకుల రియాక్షన్ చూస్తుంటే పోలింగ్ సరళి చూశాక ఓటమి భయం వైసీపీ నేతలకు పట్టుకుందా అనే అనుమానం కలుగుతోంది. వైసీపీ నేతలంతా మీడియా ముందుకు వచ్చి తమపై టీడీపీ నాయకులే దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల వేళ పోలీసుల భద్రత ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ శ్రేణులు గుమిగూడిన వెంటనే పోలీసులు చెదరగొడతారు. అదే అధికార పక్షం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీంతో వైసీపీ శ్రేణులే దాడులకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఈ గొడవలపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఓటమి భయంతో కొంతమంది ప్రత్యర్థులపై వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని జనసేన నేతను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి పామర్రు పోలీస్ స్టేషన్‌కు తరలించడం, అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థి తమ నాయకులపై పోలీసులపై ఒత్తిడి చేసి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
AP Elections 2024: సీఎం జగన్ కుట్రను భగ్నం చేసిన ఎన్నికల కమిషన్..
మండపేటలో ఏమైంది..
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండపేట నుంచి పోటీచేస్తున్న తోట త్రిమూర్తులు కుమారుడు పృద్వీ సోమవారం రాత్రి కారులో వల్లూరు వచ్చారు. ఆగ్రామంలో జనసేన, టీడీపీ నాయకులును చూసి వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని జనసేన నాయకులు చెబుతున్నారు. దీంతో పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఒకరిపై మరొకరు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు పార్టీలకు చెందిన నాయకులు గాయపడగా.. కేవలం జనసేన నేతలపై కేసులు పెట్టి.. ఆ పార్టీ కీలక నేత వేగుల లీలాకృష్ణను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన నేతలపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై ఎలాంటి కేసులు పెట్టలేదని, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆదేశాలతోనే అక్రమ కేసులు పెట్టారని కపిలేశ్వరపురం మండలం జనసేన నాయకులు చెబుతున్నారు. తమ నాయకుడిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత.. ఓటమి తప్పదని భావించి తమపై కవ్వింపు చర్యలకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
వేగుళ్ళకు మద్దతుగా..
జనసేన నేత వేగుళ్ళ లీలాకృష్ణ అరెస్ట్‌ను మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఖండించారు. పామర్రు పోలీస్ స్టేషన్‌లో లీలాకృష్ణను కలిసి తన మద్దతు తెలిపారు. మరోవైపు కపిలేశ్వరపురం మండలం అంగర, కోరుమిల్లి, టేకి, కపిలేశ్వరపురం గ్రామాలకు చెందిన జనసేన నాయకులు పామర్రు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని లీలాకృష్ణకు మద్దతు తెలిపారు. అక్రమ కేసులతో తమను అణచివేయలేరని న్యాయపరంగా అక్రమ కేసులను ఎదుర్కొంటామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా..
మండపేటతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని టీడీపీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీపై దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై ఎలాంటి కేసులు నమోదుచేయడం లేదని, కేవలం టీడీపీ, జనసేన నాయకులపై కేసులు పెడుతున్నారంటున్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంపై పోరాడామని.. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేది లేదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలింగ్ సరళి చూసిన తర్వాత ప్రజలంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే విషయం తెలియడంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News
Updated Date - May 14 , 2024 | 05:44 PM