ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు.. మంత్రి రోజాపై చంద్రబాబు విసుర్లు

ABN, Publish Date - Mar 27 , 2024 | 06:10 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలో పదవి ఇస్తామని రూ.40 లక్షలు తీసుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో అడుగడుగునా అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడికి అడ్డూ అదుపు లేదన్నారు.

నగరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నగరి ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజాపై (RK Roja) చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలో పదవి ఇస్తామని రూ.40 లక్షలు తీసుకున్నారని చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. నగరి నియోజకవర్గంలో అడుగడుగునా అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడికి అడ్డూ అదుపు లేదన్నారు. చివరికీ మట్టిని కూడా వదలడం లేదని చంద్రబాబు (Chandrababu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జనం మెచ్చిన నాయకుడు

నగరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాను ప్రకాష్ ప్రజలు మెచ్చిన నాయకుడని చంద్రబాబు ప్రశంసించారు. ప్రజలు కోరడంతో టికెట్ ఇచ్చానని వివరించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడుని తలపించేలా భాను ప్రకాష్ ప్రజా సేవ చేస్తారని వివరించారు. భానుని ఆ విధంగా తయారు చేస్తానని చంద్రబాబు జనాలకు వివరించారు. దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు భాను ప్రకాశ్ అనే సంగతి తెలిసిందే.

చంద్రబాబు హామీలు

పవర్ రూములకి 400 యూనిట్ల కరెంట్ ఇస్తాం అని చెప్పి సీఎం జగన్ మాట తప్పారని చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. పవర్ లూమ్ కార్మికులకు 5 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తామని వివరించారు. నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ తిరిగి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నగరిలో పారిశ్రామిక వాడను తీసుకొస్తామని ప్రకటించారు. టెక్స్ టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉద్యోగం కోసం ఇక్కడి నుంచి చెన్నై వెళ్లే పరిస్థితి ఇకపై ఉండదని చెప్పారు. నగరికి నీళ్లు తీసుకొచ్చే వేణుగోపాల సాగర్ హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. నగరి పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్ పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

AP Election 2024: ముసుగు వీరుడు మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడు.. జగన్‌పై చంద్రబాబు పంచ్‌లు

Updated Date - Mar 27 , 2024 | 06:10 PM

Advertising
Advertising