AP Politics: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు
ABN, Publish Date - Mar 30 , 2024 | 03:12 PM
కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ప్రకటించారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి శనివారం నాడు ప్రారంభించారు. 9 గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రం, డోర్ స్టిక్కర్ ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల అప్లికేషన్లు వచ్చాయని వివరించారు.
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ప్రకటించారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) శనివారం నాడు ప్రారంభించారు. 9 గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రం, డోర్ స్టిక్కర్ ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల అప్లికేషన్లు వచ్చాయని వివరించారు. దరఖాస్తు చేసుకున్న వారిపై సర్వే చేసి, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు.
నమ్మకం
‘కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం. రాష్ట్రానికి హోదా రావాలి. ఇప్పటికీ విభజన హామీలు అమలు కావడం లేదు. చంద్రబాబు బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకొని విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. జగన్‌ను నిర్మలా సీతారామన్ మోదీకి దత్తపుత్రుడు అన్నారు. ఒకరిది బహిరంగ పొత్తు.. మరొకరిది రహస్య పొత్తు. బాబుకి, జగన్ ఓటేస్తే బీజేపీకే ఓటు అని అర్థం అయ్యేలా చెప్పాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పాలి. ప్రత్యేక హోదా 10 ఏళ్లు కావాలని బాబు మోసం చేశాడు. అధికారం అనుభవించి రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేద్దాం అని చెప్పిన జగన్ ప్రజలను మోసం చేశాడు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరిగి ఉండేది. వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. రాష్ట్ర ప్రజల గౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని’ షర్మిల స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Andhra Pradesh: జగన్‌కు ఓటేస్తే ఏపీని హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.. బుద్దా వెంకన్న
Updated Date - Mar 30 , 2024 | 03:13 PM