AP Politics: చంద్రన్న రాజ్యంలో అన్ని రంగాల్లో మహిళల ప్రగతి: నారా భువనేశ్వరి
ABN, Publish Date - Mar 28 , 2024 | 04:42 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రంగంలో మహిళలు చంద్రన్న రాజ్యంలోనే అభివృద్ధి చెందుతారని నారా భువనేశ్వరి అభిప్రాయ పడ్డారు. లక్షలాది మంది పసుపు సైన్యం సైకిల్ మీద కదం తొక్కాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జెండా పైకి ఎగురవేసి నిజం గెలిపిద్దాం అని కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో ఆకస్మికంగా మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబాన్ని గురువారం నాడు భువనేశ్వరి పరామర్శించారు.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రంగంలో మహిళలు (Women) చంద్రన్న రాజ్యంలోనే అభివృద్ధి చెందుతారని నారా భువనేశ్వరి (Bhuvaneshwari) అభిప్రాయ పడ్డారు. లక్షలాది మంది పసుపు సైన్యం సైకిల్ మీద కదం తొక్కాలని భువనేశ్వరి (Bhuvaneshwari) పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జెండా పైకి ఎగురవేసి నిజం గెలిపిద్దాం అని కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో ఆకస్మికంగా మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబాన్ని గురువారం నాడు భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబును (Chandrababu) అక్రమ అరెస్ట్ చేయడంతో 53 రోజులు ఉద్యమంలా పనిచేసిన ఐటి ఉద్యోగులకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్‌తో సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందని నారా భువనేశ్వరి వెల్లడించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ ద్వారా మేలు జరుగుతుందని వివరించారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, అన్నదాతలకు 20 వేలు పంట పెట్టుబడి, 18 ఏళ్ళ వయస్సు నిండిన ఆడ బిడ్డలకు నెలకు రూ.1500, కుటుంబంలో చదువుకునే బిడ్డ తల్లులకు రూ. 18 వేలు, ముగ్గురు బిడ్డలు ఉంటే రూ. 45 వేలు, కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తారని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్‌కు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోందని భువనేశ్వరి మాట ఇచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
AP News: ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు
Updated Date - Mar 28 , 2024 | 04:42 PM