AP Elections: కొత్త స్కీం లేదు.. మెరుపులు లేవు.. తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో
ABN, Publish Date - Apr 27 , 2024 | 03:37 PM
వైసీపీ మేనిఫెస్టో చూసి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో వెయ్యి పాళ్లు నయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: వైసీపీ (YCP ) మేనిఫెస్టో చూసి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో వెయ్యి పాళ్లు నయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు అదిరిపోయే హామీలు ఉంటాయని వైసీపీ క్యాడర్ ఎక్స్ పెక్ట్ చేసింది. శ్రేణుల ఆశలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ నీళ్లు చల్లారు.
AP Elections: సిగ్గు, సంస్కారం వదిలేశారు.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్..
లేని జనాకర్షక పథకాలు
మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు లేకపోవడంతో శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్త పథకాలు, జనాలను ఆకర్షించే పథకాలు లేకపోవడంపై క్యాడర్‌లో నిర్వేదం నెలకొంది. కూటమి ఇచ్చిన హామీలతో పోలిస్తే తమది మేనిఫెస్టోనేనా అనే సందేహాం కలుగుతుందని కొందరు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మ ఒడి పథకంలో ఏడాదికి రూ.2 వేల మాత్రమే పెంచారు. రూ.500 పెన్షన్ పెంచడానికి 5 సమయం తీసుకుంటానని ప్రకటించారు. ఈ రెండు అంశాలతో తమ పార్టీ పని అయిపోయిందని క్యాడర్ కాస్త ఆగ్రహంతో ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దాంతో ఆ ఓటర్లను తమ పార్టీ కోల్పోతుందని వివరిస్తున్నారు.
అదిరిన కూటమి మేనిఫెస్టో
కూటమి మేనిఫెస్టోలో 50 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. దివ్యాంగులకు రూ.6 వేలు అందజేస్తామని స్పష్టం చేసింది. ఆ రెండు ప్రకటనలు బాగున్నాయని వైసీపీ ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు. తమ పార్టీ మాత్రం సోసోగా మేనిఫెస్టో రూపొందించినట్టు ఉందని మండిపడ్డారు. మూడు రాజధానులపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ మళ్లీ నిర్మిస్తామని ప్రకటించడంపై కాస్త గుర్రుగా ఉన్నారు. ఇది జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. మేనిఫెస్టోలో చంద్రబాబు గురించి ప్రస్తావించడం, ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పడం తప్ప.. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఇలాంటి ప్రకటనలతో పార్టీకి ఉన్న పేరు కాస్త పోతుందని వైసీపీ శ్రేణులు ఆందోళనతో ఉన్నారు.
AP Elections: సిగ్గు, సంస్కారం వదిలేశారు.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 27 , 2024 | 04:43 PM