YSRCP: పొదుపు మహిళలకు పెద్ద ఎత్తున విందు.. ఆపై చీరలు పంపిణీ చేసిన వైసీపీ
ABN, Publish Date - Mar 08 , 2024 | 07:43 AM
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈసారి హవా టీడీపీ, జనసేన కూటమిది నడుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ తరుణంలో నెల్లూరు రూరల్‌లో వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది.
నెల్లూరు: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈసారి టీడీపీ (TDP), జనసేన (Janasena) కూటమిది హవా నడుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో నెల్లూరు (Nellore) జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ (YSRCP).. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోవడం కూడా కష్టమేనని టీడీపీ చెబుతోంది. ఈ తరుణంలో నెల్లూరు రూరల్‌లో వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఏదో ఒకరకంగా గెలవాలన్న తాపత్రయంతో ఇప్పటి నుంచే గ్రూపుల వారీగా జనాలను ఆహ్వానించి మరీ విందు భోజనాలు వడ్డిస్తోంది.
ఇదీ అసలు కథ..
వేదాయపాళెంలో సుమారు మూడు వేల మంది పొదుపు మహిళలను వైసీపీ నేతలు ఆహ్వానించారు. వారందరికీ మటన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీసులతో ధూంధాంగా విందు భోజనం పెట్టారు. ఆపై చీరలు పెట్టి మరీ తమ వినతిని వారికి తెలిపారు. ఎంపీగా విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)ని, ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి (Adala Prabhakar Reddy)ని గెలిపించాలంటూ కోరారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే పొదుపు మహిళలు, లీడర్లు, వలంటీర్లకి పెద్ద ఎత్తున తాయిలాలు పంపిణీ చేస్తోంది. వైసీపీకి ఓట్లు వేయకుంటే పథకాలు రావంటూ దుష్ప్రచారాలు చేస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 08 , 2024 | 07:59 AM