మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?

ABN, Publish Date - Mar 30 , 2024 | 11:44 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీ ఎమ్మెల్యేలను ఐ ప్యాక్ సభ్యులు అది చేయండి, ఇది చేయండి అని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమాచారం ఇస్తూ ఇలా చేయండి, ప్రలోభాలకు గురిచేయాలని స్పష్టం చేస్తున్నారు. ఐ ప్యాక్ సభ్యుల తీరుతో కొందరు ఎమ్మెల్యేలు ఇబ్బందికి గురవుతున్నారు.

AP Politics: వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?

అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ ప్యాక్ (I PAC) అంటే వైసీపీ ఎమ్మెల్యేలు హడలి పోతున్నారు. ఆ టీమ్ సభ్యులు వస్తేనే గజ గజ వణికిపోతున్నారు. ఏం చెబుతారో.. తమను ఏం చేయమంటరోనని భయ పడిపోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను (YSRCP) ఐ ప్యాక్ సభ్యులు అంతగా ఎందుకు భయపెట్టారు. వీరంటే ఎమ్మెల్యేలు (Mla) ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.

ఏం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh) ఎన్నికల వేళ అధికార వైసీపీ ఎమ్మెల్యేలను ఐ ప్యాక్ సభ్యులు అది చేయండి, ఇది చేయండి అని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమాచారం ఇస్తూ ఇలా చేయండి, ప్రలోభాలకు గురిచేయాలని స్పష్టం చేస్తున్నారు. ఏ నియోజకవర్గం అయినా సరే ప్రలోభాల గురించి దృష్టిసారించాలని కోరారు. ఖరీదైన కానుకలు ఇచ్చి వాలంటీర్లను చెప్పు చేతల్లో ఉంచుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తే వ్యతిరేకతను తప్పించుకోచ్చని కోరారు. నియోజకవర్గంలో ఓటర్లు, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంత డబ్బు పంచాలో లెక్కలు వేసి వివరిస్తున్నారు. ఇలా వారు అన్నింటి గురించి తమకు చెప్పడం ఏంటని ఎమ్మెల్యేలు అంటున్నారు. హై కమాండ్ పేరు చెప్పి తమను బెదిరిస్తున్నారని మరికొందరు వాపోయారు.

Pawan Kalyan: పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్‌లో మార్పు.. వర్మతో ప్రత్యేక భేటీ

రాజకీయం చేయలేం

ఐప్యాక్ సభ్యులు చెప్పినట్టే చేస్తే రాజకీయం చేయలేమని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. నియోజకవర్గం గురించి తమకు అవగాహన ఉందని చెప్పినా వినిపించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికలకు వ్యుహం, తమ ఆలోచనలను అమలు చేయనివ్వడం లేదని అంటున్నారు. ఐ ప్యాక్ సభ్యులు, వారి అభిప్రాయాన్ని తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఐ ప్యాక్ సభ్యుల వల్ల గత ఐదేళ్లలో లాభం సంగతి దేవుడెరుగు.. ఎక్కువ నష్టమే జరిగిందని వివరించారు. ఒకవేళ ఐ ప్యాక్ సభ్యులు చెప్పినట్టే చేస్తే ఓటమి ఖాయం అని అంటున్నారు.

ఏమీ చేయలేని పరిస్థితి!

ఐ పాక్ సభ్యులు ఇంతలా ఇబ్బంది పెడుతోన్న ఏమి అనలేని పరిస్థితి నెలకొంది. నిలదీసి, గొడవ పడితే సీఎం జగన్ వద్దకు సమస్యను తీసుకెళతారనే భయం ఎమ్మెల్యేల్లో ఉంది. అలా గొడవ జరగడం వల్ల తిరిగి తమకే నష్టం జరుగుతోందని అంగీకరించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిని వెనక్కి తీసుకొని రావాలని హుకుం జారీచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు వాపోయారు. ఐ ప్యాక్ వల్ల ఐదేళ్లలో తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని అంగీకరించారు. ఐ ప్యాక్ సభ్యుల వల్ల పార్టీ క్యాడర్, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కుదరడం లేదని చెబుతున్నారు. ఐ ప్యాక్ సభ్యులను మెప్పించడమే పనిగా పెట్టుకున్నామని మరో ఎమ్మెల్యే వివరించారు.

మరిన్ని ఏపీ అసెంబ్లీ ఎన్నికల వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

AP Elections 2024: మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులపై జనసేన మల్లగుల్లాలు.. నాగబాబు సంగతేంటి..!?

AP Election 2024: నారా లోకేశ్‌ని కలిసిన టాలీవుడ్ ప్రముఖ హీరో నిఖిల్.. ఎందుకంటే..?

Updated Date - Mar 30 , 2024 | 12:31 PM

Advertising
Advertising