AP Politics:షర్మిలను చూస్తే జగన్‌కు భయం: వైఎస్ సునీత
ABN, Publish Date - Apr 05 , 2024 | 07:40 PM
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అంటే ఏపీ సీఎం జగన్ వెన్నులో వణుకు అని వైఎస్ సునీత తీవ్రస్థాయిలో విమర్శించారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. షర్మిల పార్టీని కాపాడారని గుర్తుచేశారు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టారని సునీత మండిపడ్డారు.
కడప: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అంటే ఏపీ సీఎం జగన్ (YS Jagan) వెన్నులో వణుకు అని వైఎస్ సునీత తీవ్రస్థాయిలో విమర్శించారు. అక్రమాస్తుల కేసులో జగన్ (Jagan) జైల్లో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. షర్మిల పార్టీని కాపాడారని గుర్తుచేశారు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టారని సునీత మండిపడ్డారు. షర్మిలను చూస్తే జగన్‌కు భయం వేసిందని వివరించారు. షర్మిలను చూస్తే వైఎస్ఆర్ గుర్తుకొస్తారని వివరించారు. వైఎస్ఆర్‌కు ఉన్న ప్రతి లక్షణం షర్మిలలో ఉందన్నారు. బద్వేల్ పట్టణంలో వైఎస్ షర్మిలతో కలిసి సునీత ప్రచారం చేశారు.
ఆశీర్వదించండి
‘వైఎస్ వివేకానంద రెడ్డి మన మధ్యలో లేరు. ఎప్పుడు వెళ్లినా పలికే వారు. నా తండ్రిని కిరాతకంగా హత్య చేశారు. హత్య చేయించింది ఎంపీ అవినాష్ రెడ్డి. ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగాడు. ఎంపీ సీట్ షర్మిలకు ఇవ్వాలని గతంలో వివేకా చెప్పారు. అవినాష్‌కి ఇవ్వొద్దని చెప్పిన జగన్ వినిపించుకోలేదు. ఇప్పుడు అవినాష్‌తో షర్మిల ఢీ కొడుతున్నారు. ఆశీర్వదించాలి అని’ వైఎస్ సునీత కోరారు.
అధికారానికి దూరంగా హంతకులు
‘నర హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే హంతకులు అధికారానికి దూరంగా ఉండాలి. హంతకులను గద్దె దించే సమయం వచ్చింది. జగన్ హత్య రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఒడించాలి. వైఎస్ షర్మిలను గెలిపించాలి అని’ సునీత కోరారు.
ఇవి కూడా చదవండి:
ResignJagan: అవ్వా, తాతలకు మద్దతుగా నెటిజన్లు.. ట్రెండింగ్‌లో రిజైన్ జగన్ హ్యాష్ ట్యాగ్
AP Election 2024: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ
మరిన్ని ఏపీ వార్తల కోసం
Updated Date - Apr 05 , 2024 | 07:41 PM