AP Elections: దోచేయడానికి సిద్ధమా.. ప్రజల ప్రశ్నలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి..!
ABN, Publish Date - Apr 05 , 2024 | 08:06 AM
మరోసారి అధికారం ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్.. ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు. వైసీపీ అధినేత బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కాని వాస్తవ పరిస్థితి వేరేగా ఉన్నట్లు తెలుస్తోంది. దేనికి సిద్ధం.. ఐదేళ్ల పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమా అంటూ ప్రజల నుంచే ప్రశ్నలు వస్తున్నాయట.
మరోసారి అధికారం ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్.. ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు. వైసీపీ అధినేత బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కాని వాస్తవ పరిస్థితి వేరేగా ఉన్నట్లు తెలుస్తోంది. దేనికి సిద్ధం.. ఐదేళ్ల పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమా అంటూ ప్రజల నుంచే ప్రశ్నలు వస్తున్నాయట. జనాల్లో జరుగుతున్న ఈ చర్చ చూసి వైసీపీ నాయకులు బిత్తర పోతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా అంటే లెక్కలతో సహా చెబుతున్నారట. వైసీపీ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడితే.. జగన్ కుటుంబం, వైసీపీ పరివారం వందల కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దోచుకోలేదా అనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. అక్రమ మైనింగ్‌లను జగన్ ప్రోత్సహించి ప్రకృతి సంపదను కొల్లగొట్టి దోచుకున్నది నిజమే కదా అని జనం నోట వినిపిస్తున్న మాట. మద్యం కాంట్రాక్ట్‌లు పొంది.. ధరలు పెంచి నాణ్యత లేని లిక్కర్ సరఫరాతో ప్రజల సొమ్మును దోచుకుంది వైసీపీ ప్రభుత్వం కాదా, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఇసుక దందాకు తెరలేపి కోట్ల రూపాయిలను దోచుకున్నది వైసీపీ ప్రభుత్వమే నంటూ ఎన్నికల వేళ పల్లెల్లో చర్చ జరగుతోంది.
‘ప్రజలపై కాదు.. మాఫియాపై దాడులు చేయండి’
భూముల కోసమే!
మరోవైపు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి మద్దతు పలికారు వైసీపీ అధినేత జగన్. ఏమైందో ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ మాట మార్చారు. విశాఖపట్టణంలోని భూములపై జగన్ కన్నుపడిందో ఏమో కాని.. ఆ ప్రాంతంలో భూములు దోచుకుని, అమ్ముకోవడానికి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరో ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుని.. ఇక్కడి ప్రజలపై అప్పుల భారం మోపడమే లక్ష్యంగా జగన్ దోచుకోవడానికి మరో అవకాశం ఇవ్వాలంటూ సిద్ధం యాత్ర చేస్తున్నారా అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
ఇళ్ల స్థలాల పేరుతో
పేద ప్రజలకు భూముల పంపిణీ పేరుతో కోట్ల రూపాయిల ప్రజా సంపదను వైసీపీ ప్రభుత్వం దోచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు పంచేందుకు ప్రభుత్వం వద్ద భూములు లేవని, ప్రయివేట్ వ్యక్తుల వద్ద భూములు కొన్నామంటూ.. మార్కెట్ ధరను పెంచి అధిక మొత్తం చెల్లించి ఈ భూములను కొనుగోలు చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వేల కోట్ల రూపాయిలను వైసీపీ నాయకులు లూటీ చేశారనే చర్చ ఎన్నికల వేళ జరుగుతుండటం వైసీపీ నాయకులకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
కమీషన్లు
కాంట్రాక్టర్ల వద్ద కమీషన్ల రూపంలో మరికొంత దోచేసింది వైసీపీ ప్రభుత్వం అనే ఆరోపణలు ఉన్నాయి. . అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు తక్కువ. కొద్దోగొప్పో చేసినా వాటిలో వైసీపీ నాయకులు పర్సంటేజీలు తీసుకున్నారనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ ఐదేళ్లు దోచుకున్నది చాలదన్నట్లు.. మరో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దోచుకోవడానికి సిద్ధమంటూ యాత్రలు చేస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు వైసీపీ నేతల ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 05 , 2024 | 08:55 AM