Share News

Hyderabad: సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

ABN , Publish Date - Oct 06 , 2024 | 05:47 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో మాజీ సీఎం కిరణ్ కుమార్ సమావేశమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ప్రస్తుత సీఎంతో మాజీ సీఎం భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Hyderabad: సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 06: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో మాజీ సీఎం కిరణ్ కుమార్ సమావేశమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ప్రస్తుత సీఎంతో మాజీ సీఎం భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.


ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తిరింది. ఇక ఇదే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు.


ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు పాలనపై ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే బీజేపీ నేత, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వివిధ సందర్భాల్లో ప్రకటించిన విషయం విధితమే.


అయితే చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్తున్నున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పోలవరం, అమరావతి నిర్మాణం కోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చర్చించినట్లు సమాచారం.

For AndhraPradesh News And Telugu News...

Updated Date - Oct 06 , 2024 | 06:37 PM