Share News

అనంతలో రూ. 44 లక్షల గోవా మద్యం పట్టివేత

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:20 AM

అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతలో రూ. 44 లక్షల గోవా మద్యం పట్టివేత

నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

రాప్తాడు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగరానికి చెందిన అబుసలేహ, దస్తగిరి హుసేన్‌, కిశోర్‌, వాచ్‌మన్‌ ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు బూసుపల్లి వెంటకశివకుమార్‌రెడ్డి పరారయ్యాడు. అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిషనర్‌ మునిస్వామి, రాప్తాడు పోలీసులతో కలిసి సోమవారం సాయంత్రం రాప్తాడు రైల్వే గేటు సమీపంలోని ఓ తోటలో దాడులు నిర్వహించారు. 474 బాక్సుల గోవా మద్యాన్ని గుర్తించారు. గొర్రెల పెంపకం పేరిట ఓ రైతు నుంచి షెడ్డును లీజుకు తీసుకుని, మద్యం నిల్వల కోసం వినియోగిస్తున్నట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.44 లక్షలు ఉంటుందని నాగమద్దయ్య తెలిపారు. గోవా నుంచి మద్యాన్ని తీసుకువచ్చి అనంతపురం సమీప ప్రాంతాల్లోని బెల్టు షాపులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వెంకశివకుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

Updated Date - Dec 10 , 2024 | 04:20 AM