ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chittoor : కుమారుడి వేధింపులు భరించలేక..సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి

ABN, Publish Date - Dec 22 , 2024 | 05:59 AM

కుమారుడి వేధింపులు భరించలేక కన్నతండ్రే బిడ్డను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఉదంతం శనివారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వెలుగు చూసింది.

  • మితిమీరిన దుష్ప్రవర్తనతో నిర్ణయం

  • చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘటన

పుంగనూరు రూరల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కుమారుడి వేధింపులు భరించలేక కన్నతండ్రే బిడ్డను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఉదంతం శనివారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ దిగువ మామిడి గుంపలపల్లెకు చెందిన గంగులరెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు సోమశేఖర రెడ్డి(36). పదేళ్ల క్రితం సోమశేఖర్‌రెడ్డి వేధింపులు భరించలేక అతని భార్య, ఐదేళ్ల కుమారుడు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో సోమశేఖర్‌రెడ్డితో పాటు తండ్రి గంగులరెడ్డి కూడా జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి బయటకు వచ్చాక సోమశేఖర్‌రెడ్డి ఊర్లో అందరితో గొడవలకు దిగేవాడు. ఇతడి ప్రవర్తన భరించలేక సోదరుడు జ్ఞానేంద్రరెడ్డి తన భార్యాపిల్లలతో దూరంగా వెళ్లిపోయాడు. తల్లిదండ్రులతో ఉంటోన్న సోమశేఖర్‌రెడ్డి.. వారిని కూడా కొట్టి డబ్బులు లాక్కోవడం చేసేవాడు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించి, ఎవరూ అమ్మాయిని ఇవ్వకపోవడంతో ఆ కోపాన్ని అమ్మానాన్నల మీద చూపేవాడు. ఇలా సోమశేఖర్‌రెడ్డి ప్రవర్తన మితిమీరిపోవడంతో తండ్రి గంగులరెడ్డి అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ గానుగలగడ్డకు చెందిన అమర్‌(24),రమేశ్‌(20) అనే ఇద్దరితో మాట్లాడి రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.30 వేలు ఇచ్చినట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం సోమశేఖర్‌రెడ్డిని పథకం ప్రకారం కృష్ణాపురం సమీపంలోని బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకువచ్చిన అమర్‌, రమేశ్‌.. అతని చేత మద్యం తాగించి హత్య చేశారు. రెండు రోజుల క్రితం నిందితుడు ఈ విషయాన్ని మద్యం మత్తులో బయటకు చెప్పడంతో పోలీసులకు తెలిసింది. ఈలోగా పశువుల కాపరులు అడవిలో దుర్వాసన వస్తుండడంతో గమనించగా, గుర్తుపట్టలేని విధంగా మృతదేహం కన్పించింది. చండ్రమాకులపల్లె వీఆర్వో శ్రీనివాసులుకు ఈ సమాచారం తెలపగా, ఆయన ఫిర్యాదు మేరకు పుంగనూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహం పాడైపోవడంతో తరలించడానికి వీలుకాలేదు. దీంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. పుంగనూరు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిందితులు గంగులరెడ్డి, అమర్‌, రమేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 06:01 AM