అనుమతులు లేకుండా ‘సిద్ధం’ ఫ్లెక్సీలు
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:50 AM
వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేశారు. అనుమతులు లేకుండా ఎక్కడికక్కడ జగన్ సిద్ధం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
పిఠాపురంలో ఎన్నికల నిబంధనలు బేఖాతర్
పిఠాపురం, ఏప్రిల్ 18: వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేశారు. అనుమతులు లేకుండా ఎక్కడికక్కడ జగన్ సిద్ధం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సీఎం జగన్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా అచ్చంపేటవద్ద శుక్రవారం జరిగే బహిరంగసభ అనంతరం బస్సులో చిత్రాడ, పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు బైపాస్ రోడ్డుల మీదుగా వెళ్లనున్నారు. జగన్ పర్యటన సాగే బైపా్సరోడ్డు ప్రాంతాల్లో పలుచోట్ల జగన్ సిద్ధం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇళ్లపై ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలకు ఎటువంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. అయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.