Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసం.. మరొకటి వెలుగులోకి..
ABN, Publish Date - Nov 27 , 2024 | 12:17 PM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం నాని.. భవన నిర్మిణ కార్మికులకు నగదు చెల్లింపులు చేయ్యకుండా ఎగకొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు రహదారిపై ఆందోళనకు దిగారు.
గన్నవరం, నవంబర్ 27: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అనుచరుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన అనుచరులు చేసిన పలు మోసాలు బహిర్గతమైనాయి. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. గన్నవరం సమీపంలో గుర్రం అంజయ్య (నాని).. చంద్రికా అయోధ్య భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణంలో కార్మికులకు సుమారు రూ. 4 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాటిని గుర్రం నాని ఎగవేసినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు.
Also Read: కొనసాగుతున్న గాలింపు.. వర్మ పిటిషన్‌పై నేడు విచారణ
ఆస్తులను విక్రయించి.. నగదు చెల్లించిన భవన నిర్మాణ కాంట్రాక్టర్లు రామ్మోహనరావు, సతీష్‌లను గుర్రం నాని మోసం చేశారని వారు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు చెల్లించిన నగదు.. తమకు చెల్లించకుండా గుర్రం నాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. తప్పుడు లెక్కలతో బెదిరించి దిక్కున్న చోట చెప్పుకో మంటున్నారని కార్మికులు ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: యూఎస్‌లో కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గన్నవరంలోని చంద్రికా అయోధ్య గృహ సముదాయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. మరోవైపు గన్నవరంలో స్థానిక టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై టఇటీవల గుర్రం నాని దాడి చేశారు. ఈ కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో గుర్రం నాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తమకు నగదు చెల్లించకుండా.. గుర్రం నాని చేసిన మోసంతో తామంతా రోడ్డుపై పడ్డామని కూలీల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.
Also Read: మళ్లీ వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక
దీంతో పురుగుల మందు డబ్బాలతో కార్మికులు రోడ్డుపై ధర్నాకు దిగారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ క్రమంలో ఆందోళనకు దిగిన కార్మికుల చేతిలోని పురుగుల మందు డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి నచ్చ చెప్పి.. ఆందోళన విరమింప చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
మజ్జిగ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
మరోవైపు గత జగన్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీల... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు భారీగా అవినీతికి సైతం పాల్పడినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. అందులోభాగంగా వారిపై చర్యలుకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. అయితే వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ సైతం ఓటమిపాలైన విషయం విధితమే.
For Andhrapradesh News And Telugu News
Updated Date - Nov 27 , 2024 | 12:19 PM