Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్
ABN, Publish Date - Jul 01 , 2024 | 12:41 PM
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న కేసులో సురేష్ సోదరుడు ప్రభుదాసు అరెస్ట్ అయ్యారు. రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
గుంటూరు: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న కేసులో సురేష్ సోదరుడు ప్రభుదాసు అరెస్ట్ అయ్యారు. రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అవి నందిగం ప్రభుదాస్‍కు చెందిన ఇసుక లారీలుగా గుర్తించడం జరిగింది. నందిగం ప్రభుదాస్‍ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. రెండు లారీలు, కారును స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇసుక అక్రమ రవాణాకు పూనుకుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాను ఆపడం లేదు. కొనసాగిస్తూనే ఉన్నారు. అలా చేస్తూనే ఇవాళ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అడ్డంగా బుక్ అయ్యారు.
Updated Date - Jul 01 , 2024 | 12:41 PM