ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆంధ్ర వెళ్లి అన్నతో తేల్చుకోవాలని గతంలోనే షర్మిలకు చెప్పా : వీహెచ్‌

ABN, Publish Date - May 24 , 2024 | 04:32 AM

మూడేళ్ల క్రితమే షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌ హనుమంతరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తన అన్నతో తేల్చుకోవాలని గతంలోనే తాను షర్మిలారెడ్డికి చెప్పానని గుర్తుచేశారు.

రాజమహేంద్రవరం సిటీ, మే 23 : మూడేళ్ల క్రితమే షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌ హనుమంతరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తన అన్నతో తేల్చుకోవాలని గతంలోనే తాను షర్మిలారెడ్డికి చెప్పానని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజీవ్‌ గాంధీ కళాశాలలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరొక ఐదేళ్లలో పరిస్థితులన్నీ సర్దుకుని కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్‌డీఏ అవుట్‌ కావడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని నెలకొల్పాలని నిర్ణయించామని,రాజమహేంద్రవరంలో విగ్రహాన్ని తయారు చేస్తున్న వడయార్‌ను కలిసి విగ్రహాన్ని పరిశీలించామన్నారు.

Updated Date - May 24 , 2024 | 04:32 AM

Advertising
Advertising