ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: చంద్రబాబు నివాసానికి షకావత్ బృందం..

ABN, Publish Date - Mar 11 , 2024 | 12:55 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ బృందం చేరుకుంది. వీరితో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఏపీలోని తమ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కూడా భేటీ అయ్యారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ (Gajendra Singh Shekawat) బృందం చేరుకుంది. వీరితో జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఏపీలోని తమ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో కూడా భేటీ అయ్యారు.

AP News: ‘టారిఫ్‌’ తూచ్‌!

పొత్తులో భాగంగా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలతో పాటు ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై కూడా పవన్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక నేడు చంద్రబాబు నివాసంలో ఆయనతో పాటు జనసేన నేతలతో షకావత్ బృందం భేటీ అయ్యింది. ఇవాళ్టి భేటీలో బీజేపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కాగా.. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన కలిపి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. నేటి భేటీతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కొలిక్కివచ్చే అవకాశం ఉంది.

AP Politics: రెండ్రోజుల్లో టీడీపీలోకి వైసీపీ ఎంపీ..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 01:14 PM

Advertising
Advertising