ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Devinavaratri: కోనసీమలో కరెన్సీ అమ్మవారు..

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:12 PM

Andhrapradesh: ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఆ దేవదేవిని చూసేందుకు భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోనసీమలో ఓ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

Goddess Mahalaxmi

దేశవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాల శోభ సంతరించుకుంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవీనవరాత్రి ఉత్సవాలు నేటితో(మంగళవారం) ఆరవరోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఆ దేవదేవిని చూసేందుకు భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోనసీమలో ఓ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ అమ్మవారి ప్రత్యేకత ఏంటి.. భక్తులు ఇంతలా ఆశ్చర్యపోవడానికి కారణమేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Bathukamma: ఏడో రోజు వేపకాయ బతుకమ్మ.. ఈరోజు ఏం చేస్తారంటే


మహాలక్ష్మి అలంకరణలో..

అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతీరోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరవరోజైన ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 3 కోట్ల 33 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది. 50, 100, 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు. అంతేకాదు ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు. రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లు చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.


అంతా కరెన్సీమయం...

కరెన్సీ నోట్ల అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దసరా సందర్భంగా మూడు కోట్ల 33 లక్షల 33 వేల, 333 రూపాయలతో వాసవి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా విశేషంగా అలంకరించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమలాపురంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి అమ్మవారిని కొత్త కరెన్సీ నోట్లతో ఆర్యవైశ్య సంఘం కమిటీ అలంకరించింది. ఈ క్రమంలో ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేకంగా రూ.3.33 కోట్లతో విశేషంగా అలంకరించబడిన మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకోవడానికి ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసింది. కరెన్సీ నోట్లతో పాటు కాయిన్స్‌తో ధగధగా మెరిపోతున్న అమ్మవారిని చూసి భక్తులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Vinesh Phogat: వరించిన అదృష్టం.. మల్లయోధురాలు ఘన విజయం..


తెలంగాణలోనూ...

కాగా.. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేకంగా కరెన్సీతో అలకరించారు. ఉత్సవాల్లో భాగంగా మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పెద్ద మొత్తంలో డబ్బులతో అలకరించారు. దాదాపు 3,51,00,00 రూపాయలతో ధనలక్ష్మి దేవిని పట్టణ ఆర్యవైశ్యులు అలంకరించారు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు.


ఇవి కూడా చదవండి..

Palnadu: క్రోసూరులో యువకుడు హల్‌చల్.. బురఖా ధరించి ఏకంగా..

Sakshi Bad Manner: మరోసారి అడ్డంగా దొరికేసిన సాక్షి.. ఇకనైనా ఆపు నీ డ్రామాలు..

Read Latest Devotional News And AP News And Telugu News

Updated Date - Oct 08 , 2024 | 03:12 PM