ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madanapalle Sub Collector Office: సబ్ కలెకర్ట్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనలో కీలక పరిణామం

ABN, Publish Date - Dec 30 , 2024 | 09:30 PM

Madanapalle Sub Collector Office: ఈ ఏడాది జులైలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న గౌతమ్ తేజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మదనపల్లి, డిసెంబర్ 30: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌ను సీఐడీ పోలీసులు సోమవారం పలమనేరులో అరెస్ట్ చేశారు. చిత్తూరులోని సీఐడీ కోర్టులో అతడిని హాజరు పరిచారు. ఈ కేసులో అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఫైల్స్ దగ్దం కేసులో గౌతమ్ తేజ్.. ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు.

మరోవైపు ఈ కేసులో ప్రధాన పాత్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మదనపల్లి ఆర్డీవో హరిప్రసాద్, మాజీ ఆర్డీవో మురళితో సహా పలువురిని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆదాయనికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంగా పాత ఆర్డీఓ మురళిని ఇప్పటికీ ఏసీబీ అధికారుల అరెస్టు చేసిన విషయం విధితమే.

ఈ ఏడాది జులై 21వ తేదీ రాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే.. ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక ఫైల్స్ కాల్చివేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి ప్రాథమిక విచారిణలో ఇది వాస్తమని తేలింది.


ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు... ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై తొమ్మిది కేసులు నమోదు చేశారు.

Also Read : రేషన్ బియ్యం మాయం కేసులో.. కీలక పరిణామం


వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసును లోతుగా విచారించేందుకు సీఐడీకి అప్పగిస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఆ క్రమంలో అందుకు సంబంధించిన అన్ని ఫైల్స్ సీఐడీకి అప్పగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Also Read :సైంధవ లవణంతో ఇన్ని లాభాలున్నాయా..?


ఆ క్రమంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులపైనే కాకుండా.. నాయకులపైన సైతం కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆర్పీ సీసోడియా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. దస్త్రాలకు సంబంధించి ఉన్నతాధికారులను ఆయన ఆరా తీసిన సంగతి తెలిసిందే.

Also Read :పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్

Also Read: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక

Also Read: కొత్త ఏడాదిలో వారిద్దరికి సినిమా చూపిస్తాం

Also Read: రేవంత్ ఈగో చల్లబడింది..

Also Read: చిన్మయ దాస్ తీవ్ర అనారోగ్యం.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్‌కు వినతి

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 09:48 PM