ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

APPSC Group-1: నేడే గ్రూప్-1.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్..

ABN, Publish Date - Mar 17 , 2024 | 08:35 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏపీపీఎస్సీ గ్రూప్-1ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్షా 48వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏపీపీఎస్సీ గ్రూప్-1ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్షా 48వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరి కోసం 301 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరక పేపర్-2 పరీక్ష జరగనుంది. గ్రూపు-1 పరీక్షలు ( Group-1 Exams ) జరిగే కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులను నియమించారు. పరీక్షల పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్‌ఛార్జ్‌గా అపాయింట్ చేశారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును ఏపీపీఎస్సీ అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. పరీక్ష అనంతరం ఆన్సర్ సీట్లు ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తారు.


కాగా.. 2018లో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్లను రెండు మూడు సార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్దమని హైకోర్టు తెలిపింది. పరీక్షను తాజాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇవాళ జరగనున్న పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2024 | 08:35 AM

Advertising
Advertising