ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bank Fraud : రూ.425 కోట్లు గల్లంతు!

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:25 AM

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ కుంభకోణం పూర్తిస్థాయిలో వెలుగుచూసింది. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు...

  • ఉమ్మడి గుంటూరు జిల్లా సహకార సంఘాల్లో భారీ కుంభకోణం

  • వైసీపీ హయాంలో బినామీల పేరిట నిధులు స్వాహా

  • జీడీసీసీ వేదికగా సాగిన నకిలీ రుణాల బాగోతాలు

  • తాజాగా ఆడిట్‌తో అక్రమాలు వెలుగులోకి

  • సీఐడీ విచారణకు 2022లోనే ఉన్నతాధికారి లేఖ

  • ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు

గుంటూరు సిటీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ కుంభకోణం పూర్తిస్థాయిలో వెలుగుచూసింది. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(జీడీసీసీ), సొసైటీల్లో సుమారు రూ.425 కోట్లు గల్లంతైనట్లు ఆడిట్‌ తనిఖీల్లో వెల్లడైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ అక్రమాల తంతు జరిగినట్లు తేలింది. వైసీపీకి చెందిన పలువురు ప్రముఖులు.. ఊరూపేరు లేని బినామీలను అడ్డంపెట్టుకుని రుణాల పేరిట జీడీసీసీ, సహకార సంఘాల్లో వందల కోట్లు దారిమళ్లించినట్లు గుర్తించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 42 జీడీసీసీ బ్యాంకు శాఖలు, 167 సహకార సంఘాల్లో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వసూలు కానీ మొండి బకాయిలు ఎవరివన్న కోణంలో ఆరా తీస్తే వైసీపీ నేతలు సాగించిన హస్తలాఘవం బయటికొచ్చింది. గుంటూరు పరిసర ప్రాంతాల్లోని కోల్డ్‌స్టోరేజ్‌లు, ఇతర వ్యాపార సంస్థలను అడ్డంపెట్టుకుని సదరు నేతలు ఇబ్బడిముబ్బడిగా రుణాల పేరిట బ్యాంకు సొమ్ము దారిమళ్లించారు. వాస్తవానికి జిల్లా సహకార శాఖ అధికారులు 2022లోనే ఇలాంటి అక్రమాలను గుర్తించి అప్పటి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు.ఆ వెంటనే ఓ ఉన్నతాధికారి ఈ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం. అయితే వైసీపీలోని ప్రముఖ నేతలు ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించినందున సీఐడీ విచారణకు అడ్డుతగిలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత జీడీసీసీ వేదికగా సాగిన నకిలీ రుణాల బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూ రు జిల్లాలోని ప్రత్తిపాడు, నల్లపాడు, రెడ్డిపాలెం, గోరంట్ల, కాకుమాను, పెదనందిపాడు, పల్నాడు జిల్లాలోని గురజాల తదితర ప్రాంతాల్లో ఒకరి పేరుతో వేరొకరు రుణాలు పొందినట్లు వెలుగులోకి వచ్చింది.


వాటిపై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో రూ.425 కోట్లు దారిమళ్లించిన వ్యవహారం బయటకు వచ్చింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే సుమారు రూ.225 కోట్లు వసూలు కాని మొండి బకాయిలుగా గుర్తించారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. మొండి బకాయిలు పేరిట ఉన్న మొత్తం సొమ్మంతా వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్లి ఉంటుందని కొందరు అధికారులు అంటున్నారు. ఈ అక్రమాల్లో జీడీసీసీ బ్యాంకు అధికారులు, సిబ్బంది, సహకార సంఘాల్లోని సిబ్బంది పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అక్రమాలపై జీడీసీసీ, సహకార శాఖలోని అధికారులతో లోపాయికారి విచారణ జరిపిస్తుండటంపై కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ఆయా శాఖలకే చెందిన అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావని, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది. సీఐడీ విచారణ జరిపించాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.

విచారణాధికారులకు బెదిరింపులు!

జీడీసీసీ, సహకార సంఘాల్లో జరిగిన అక్రమాలపై జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో బ్యాంకు అధికారులు, సిబ్బందితో పాటు, సహకార శాఖలోని కొందరు ఉద్యోగుల పాత్ర కూడా ఉందని తేల్చి చర్యలకు ఉపక్రమించారు. బాధ్యులైన ఉద్యోగుల కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కొందరిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయించారు. ఈ క్రమంలో విచారణ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళా అధికారి తెర వెనుక నుంచి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Updated Date - Dec 18 , 2024 | 04:25 AM