ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Guntur : ఆ ఇద్దరు.. ‘ఉత్తములు’ కారు!

ABN, Publish Date - Aug 16 , 2024 | 04:25 AM

వైసీపీ ఘోర పరాజయం చెంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దేవదాయశాఖ ఉన్నతాధికారుల పోకడల్లో మాత్రం మార్పు రాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పెద్దల అండతో ఏకంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు....

  • ఉత్తమ సేవా పురస్కారాల జాబితా నుంచి తొలగింపు

  • గుంటూరు కలెక్టర్‌ ఆదేశాలతో దేవదాయశాఖ చర్యలు

  • ఆ ఇద్దరికీ రాలేదని, అర్హులైన మరో ఇద్దరినీ తప్పించిన వైనం

  • దేవదాయశాఖలో ఎవరికీ దక్కని అవకాశం

గుంటూరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఘోర పరాజయం చెంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దేవదాయశాఖ ఉన్నతాధికారుల పోకడల్లో మాత్రం మార్పు రాలేదు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పెద్దల అండతో ఏకంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు సభనే అడ్డుకునే ప్రయత్నం చేసిన గుంటూరు దేవదాయశాఖ అన్నసత్రం ఈవో నారాయణతోపాటు, అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో అంటకాగి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యేలందరి ఇళ్లకు డిప్యూటీ కమిషనర్‌ మహేశ్వరరెడ్డితో పాటు వెళ్లి వేద పండితులతో ఆశీర్వచనాలు ఇచ్చి సత్కరించిన అప్పటి మంగళగిరి ఈవో నారాయణ(ప్రస్తుతం ఏసీ)లకు ఇప్పటికీ కొమ్ముకాస్తున్నారు. వైసీపీ హయాంలో చెప్పినట్లు వ్యవహరించిన ఈ ఇద్దరు ఈవోల పేర్లను తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కరాలకు తమ శాఖ తరఫున ఎంపిక చేసి జిల్లా కలెక్టర్‌కు జాబితా పంపించారు.


ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 12న ‘వైసీపీతో అంటకాగితే ‘ఉత్తములే’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి స్పందించారు. గతంలో వారిద్దరు వ్యవహరించిన తీరుపై దర్యాప్తు నిర్వహించి, వాస్తవమని తేలటంతో వారి పేర్లను తొలగించాల్సిందిగా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ ఇద్దరికి ఉత్తమ సేవా పురస్కారాలు అందుకునే అవకాశం చేజారింది.

విశేషమేమిటంటే దేవదాయశాఖ నుంచి వీరిద్దరితో పాటు ఏసీ డి.శ్రీనివాసరావు (వాసు), ఏసీ కార్యాలయ సూపరింటెండెంట్‌ భాగ్యలక్ష్మి పేర్లను కూడా పంపారు. వీరు అర్హులైనప్పటికీ తాము కోరుకున్న వారికి దక్కలేదనే అక్కసుతో వీరి పేర్లు కూడా ఉపసంహరించుకున్నారు. కాగా, వీరిద్దరి పేర్లను ఎంతో బరితెగించి సిఫారసు చేసిన ఉన్నతాధికారులపై టీడీపీ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

Updated Date - Aug 16 , 2024 | 04:29 AM

Advertising
Advertising
<