AP News: గుంటూరులో వరుస హత్యలు చేస్తున్న మహిళా ముఠా అరెస్ట్
ABN, Publish Date - Sep 06 , 2024 | 03:27 PM
అప్పులు ఎగొట్టేందుకు ఓ మహిళల ముఠా మాస్టర్ స్కెచ్ వేసింది. సైనైడ్ ఉపయోగించి వరుస హత్యలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతోంది. మహిళల ముఠా చాకచక్యంగా హత్యలు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతోంది.
గుంటూరు : అప్పులు ఎగొట్టేందుకు ఓ మహిళల ముఠా మాస్టర్ స్కెచ్ వేసింది. సైనైడ్ ఉపయోగించి వరుస హత్యలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతోంది. మహిళల ముఠా చాకచక్యంగా హత్యలు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతోంది. చివరికి వారి పాపం పండి పోలీసులకు చిక్కింది. ఆ ముఠాలోని ముగ్గురు సభ్యుల బండారం బయట పడటంతో అందరూ అవాక్కవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే... గుంటూరులో వరుస హత్యలు కలకలం సృష్టించాయి. హత్యలు చేస్తున్న మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈరోజు(శుక్రవారం) మీడియాకు వెల్లడించారు. జూన్‌లో నాగూర్‌బీ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేశామని అన్నారు. బ్రీజర్‌లో సైనైడ్ కలిపి ఇవ్వడంతోనే ఓ మహిళ మృతి చెందిందని పేర్కొన్నారు. సదరు మహిళను హత్య చేసినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టామని, ఈ హత్యలు చేయడానికి గోల్డ్ షాపులో వాడే సైనైడ్‌ను ఉపయోగించినట్లు తమ విచారణలో వెల్లడైందని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ విధంగా ఇప్పటివరకు నలుగురుని సైనైడ్ కలిపి హత్య చేశారని పోలీసులు ప్రకటించారు. మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసి విఫలమయ్యారని వివరించారు. ఆహారం, డ్రింక్‌లో సైనైడ్ కలిపి నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు. 2022 నుంచి ఈ తరహా నేరాలను ఈ ముఠా కొనసాగిస్తోందని అన్నారు. డబ్బు కోసం, అప్పులు ఎగ్గొట్టేందుకు ఈ హత్యలు చేశారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేశామని అన్నారు. ముగ్గురిలో ఒకరు గతంలో వలంటీర్‌గా పని చేశారని తెలిపారు. మహిళలకు సైనైడ్ విక్రయిస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బుడమేరును మింగేసిన వైసీపీ నాయకులు..
సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..
టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
YCP: అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్..
కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 06 , 2024 | 04:12 PM