ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సూపర్ స్టార్ రజనీకాంత్ సర్జరీ విజయవంతం.. పరామర్శించిన సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Oct 01 , 2024 | 09:25 PM

తమిళ సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు హృదయ సంబంధిత సర్జరీ విజయవంతం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సర్జరీ అనంతరం రజనీకాంత్‌కు సీఎం ఫోన్ చేసి పరామర్శించారు.

అమరావతి: తమిళ సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు హృదయ సంబంధిత సర్జరీ విజయవంతం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సర్జరీ అనంతరం రజనీకాంత్‌కు సీఎం ఫోన్ చేసి పరామర్శించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని తెలిసి అభిమానులంతా ఆందోళన చెందారని, శస్త్రచికిత్స సక్సెస్ అయ్యిందని తెలిసి ఏపీ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు రజనీకాంత్‌కు చెప్పారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ సూపర్ స్టార్‌ని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు శస్త్రచికిత్స విజయవంతం కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సర్జరీ సక్సెస్ అయ్యినట్లు తెలిసిందని, త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.


సూపర్ స్టార్‌కి ఏమైందంటే..

గుండె సంబంధించిన రక్తనాళంలో వచ్చిన వాపు కారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు రజనీకాంత్‌కు హృదయం నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని గుర్తించారు. అనంతరం ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స చేశారు. రక్తనాళంలో వచ్చిన వాపుకి వైద్యులు విజయవంతంగా స్టెంట్‌ వేశారు. అలాగే ఎండోవాస్కులర్ రిపేర్ ప్రణాళికాబద్ధంగా సాగించారు. సూపర్ స్టార్ మరో రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు.


మరోవైపు ఆందోళనలో ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు అపోలో ఆస్పత్రి యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరూ ఆందోళన చెందవద్దని రజనీకి శస్త్రచికిత్స సక్సెస్ అయ్యిందని వైద్యులు తెలిపారు. ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. దీంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తలైవా త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్‌’ అక్టోబర్‌ 10న విడుదలకానుంది.

Updated Date - Oct 01 , 2024 | 09:33 PM