Amaravati Farmers: కాలినడకన ఇంద్రకీలాద్రికి వెళ్లనున్న రాజధాని రైతులు..
ABN, Publish Date - Jun 22 , 2024 | 07:49 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం(NDA government) అధికారంలోకి రావడంతో విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు అమరావతి రైతులు(Amaravati Farmers) ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కాలినడకన బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో 29గ్రామాల రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పెద్దఎత్తున పాల్గొననున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం(NDA government) అధికారంలోకి రావడంతో విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు అమరావతి రైతులు (Amaravati Farmers) ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కాలినడకన బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో 29గ్రామాల రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పెద్దఎత్తున పాల్గొననున్నారు. తుళ్లూరు నుంచి పొంగళ్లు నెత్తిన పెట్టుకుని విజయవాడ అమ్మవారిగుడికి కాలినడకన వెళ్లనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో వారిలో రాజధాని ఆశలు మళ్లీ మెులకెత్తాయి. రాజధాని నిర్మాణం సాకారం అవుతుండడంతో మొక్కులు చెల్లించునేందుకు పెద్దఎత్తున దుర్గమ్మను దర్శించుకోనున్నారు.
Pawan Kalyan: జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే ప్రజాదర్బార్ నిర్వహించిన పవన్..
2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. అమరావతే రాజధాని అంటూ శాసనసభలో చెప్పారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అంశంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో అమరావతి రైతులు పెద్ద ఉద్యమమే చేపట్టారు. ఆ సమయంలో రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమరావతి రైతులు 1631 రోజులపాటు దీక్ష చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చి వైసీపీ హయాంలో నానాపాట్లు పడ్డారు. తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తమ 1631రోజుల దీక్ష ఫలించిందని, అమ్మవారికి మెుక్కులు చెల్లించుకునేందుకు కాలినడకన పెద్దఎత్తున ఇంద్రకీలాద్రి చేరుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
రెచ్చిపోయిన మాజీ ఎంపీ ఆదాల అనుచరులు..
Jagan Convoy Accident: మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌కి తృటిలో తప్పిన ప్రమాదం..
Updated Date - Jun 22 , 2024 | 07:49 PM