ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: అల్లు అర్జున్‌కు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

ABN, Publish Date - Dec 14 , 2024 | 06:38 PM

సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసి చంద్రబాబు పరామర్శించారు.

AP CM Chandrababu Naidu

అమరావతి: సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసి చంద్రబాబు పరామర్శించారు. కష్టకాలంలో ధైర్యం కోల్పోవద్దంటూ సముదాయించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా బన్ని అక్కడికి వెళ్లారు. అయితే ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


అయితే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను గురువారం అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయస్థానం బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ వచ్చింది. అప్పటికే బన్నీని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. అనంతరం అనేక నాటకీయ పరిణామాల మధ్య అర్జున్ శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బన్నీని పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.

Updated Date - Dec 14 , 2024 | 06:54 PM