ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ వివరాలు ఇవే..

ABN, Publish Date - Dec 25 , 2024 | 08:07 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 8:30 గంటలకు మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఎన్డీయే నేతల సమావేశానికి హాజరవుతారు.

AP CM Chandrababu Naidu

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఇవాళ (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah)తోపాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. అలాగే వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలు, ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.

Hanumakonda: ఇంటర్ మెుదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య.. విషయం ఇదే..


షెడ్యూల్ ఇదే..

కాగా, ఇవాళ ఉదయం 8:30 గంటలకు మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపైనా ప్రధాని, అమిత్ షాలతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు వారితో చర్చలు జరపనున్నారు.

Today Gold Rates: గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..


ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించేలా సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్‌లో ఏపీకి మరిన్ని నిధులు కేటాయించాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కుమారస్వామి ఆయన్ని కలవనున్నారు. కేంద్ర మంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానిలో పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్‌ నగరానికి చంద్రబాబు చేరుకుంటారు. గురువారం అక్కడ ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. అనంతరం శుక్రవారం తిరిగి అమరావతికి చేరుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Today Gold Rates: గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ACB Files : సంజయ్‌పై ఏసీబీ కేసు

Updated Date - Dec 25 , 2024 | 08:50 AM