AP News: నారా రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం తెలిపిన స్పీకర్, డిప్యూటీ సీఎం..
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:14 PM
సోదర వియోగంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంతాపం వ్యక్తం చేశారు. రామ్మార్తి నాయుడు అనారోగ్య సమస్యలతో మరణించారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురైనట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.
Lokesh: చిన్నాన్న ఇక చిరకాల జ్ఞాపకం
సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని డిప్యూటీ సీఎం పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తి కుమారుడు, సినీ హీరో రోహిత్, కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు.
AP: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సర్చ్ వారెంట్.. ఏ క్షణంలోనైనా..
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని స్పీకర్ పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకూ చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విశేష సేవలు అందించారని అయ్యన్న గుర్తు చేశారు.
Gv Anjaneyulu: జగన్‌కు ప్యాలెస్‌లు.. పేదలకు టిడ్కో ఇల్లు వద్దా.. జీవీ ఆంజనేయులు ధ్వజం
1994-1996 మధ్య తన సహచర శాసనసభ్యుడిగా రామ్మూర్తి పనిచేశారని, నియోజకవర్గానికి ఆయన విశిష్టమైన సేవలు మరవలేనివని స్పీకర్ అయ్యన్న కొనియాడారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించినట్లు స్పీకర్ చెప్పుకొచ్చారు. రామ్మూర్తి నాయుడి సేవలను తెలుగు ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
YS Sharmila: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రాక ముందే ఆ పని చేయండి: వైఎస్ షర్మిల
Nara Rammurthy naidu: రామ్మూర్తి నాయుడు మృతిపై ప్రముఖుల సంతాపం
Updated Date - Nov 16 , 2024 | 06:16 PM