ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: రాష్ట్ర ప్రజలంతా ఓవైపు.. ఆయన మాత్రం మరోవైపు..

ABN, Publish Date - Sep 12 , 2024 | 09:10 AM

రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏమి లేకపోయినా.. ఏదో జరిగిందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు సబ్‌జైలులో మాజీ ఎంపీ..

YS Jagan

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే.. రాష్ట్రప్రజలంతా ఓవైపుంటే.. తాను మాత్రం మరోవైపు అన్నట్లు కనిపిస్తోంది. వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలంతా అభినందిస్తుంటే జగన్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. జగన్ తీరు చూస్తుంటే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా మనిషిలో మార్పు రాలేదా అనే అనుమానం కలుగుతోందట. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వం ఏవైనా పొరపాట్లు చేసినా, లేదంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విపక్ష పార్టీగా వాటిని ఎత్తి చూపించడం సహజం. కానీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏమి లేకపోయినా.. ఏదో జరిగిందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు సబ్‌జైలులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లోకి ఎక్కువుగా వచ్చేవారు కాదు. కేవలం అధికారులకు ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకునేవారన్న విమర్శలు లేకపోలేదు. ప్రతిపక్షాలు ఏవైనా సలహాలు, సూచనలు చేసినా వాటిని పట్టించుకోని జగన్.. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల సమయంలో తక్షణమే స్పందించి భారీ ప్రాణానష్టం జరగకుండా నియంత్రించగలిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కానీ స్వరాష్ట్రంలో విపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


సకాలంలో స్పందించిన ప్రభుత్వం..

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వాస్తవ పరిస్థితి ఒక విధంగా ఉంటే జగన్ మరో విధంగా చెబుతుంటే ప్రజలు సైతం ఆయన మాటలు విశ్వసించడం లేదట. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదలు వచ్చిన వెంటనే సకాలంలో స్పందించి వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజల యోగ, క్షేమాలను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వారికి అవసరమైన ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. బుడమేరు కాల్వ గండిని వేగవంతంగా పూడ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును స్వయంగా గండి పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా సహాయక చర్యలు చేపట్టలేదని ప్రజలు ఓవైపు చెబుతుంటే.. జగన్ మాత్రం టీడీపీ ప్రభుత్వంపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వరదల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతోనే భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని ఎందరో వరద బాధితులు చెబుతుంటే.. జగన్ మాత్రం తన పొలిటికల్ మైలేజ్ కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుంటారా లేదంటే ఇదే ధోరణిని కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Anadhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 12 , 2024 | 09:10 AM

Advertising
Advertising