ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: జర్నలిస్ట్ విజయ్‌బాబుపై హైకోర్టు సీరియస్.. భారీ జరిమానా

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:29 PM

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ శ్రేణులతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోకుండా తాము ఆదేశించలేమని హైకోర్టు పలువురు పిటిషనర్లకు సూచించింది.

AP High Court

జర్నలిస్ట్ విజయ్‌బాబుపై హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడుతున్నారంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు విజయ్‌బాబు తీరుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు రూ.50 వేల జరిమానా ఏపీ హైకోర్టు విధించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ శ్రేణులతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోకుండా తాము ఆదేశించలేమని హైకోర్టు పలువురు పిటిషనర్లకు సూచించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కేసులు పెడుతున్నారంటూ విజయ్‌బాబు కోర్టుకు ఆశ్రయించడంతో.. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని పిటిషనర్‌ను న్యాయస్థానం హెచ్చరించింది. కిరాయి మూకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్నవారిపై చర్యలు తీసుకోవల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

పిటిషన్ డిస్మిస్

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారికి మద్దతుగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేయడంపై హైకోర్టు విజయ్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిందది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు తమ హక్కులు తెలుసుకోకుండానే పోస్టులు పెడుతున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని, వారి తరపున పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. సమాజంలో తమ బాధను చెప్పుకోలేనివారి కోసం వేయాల్సిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేశారని కోర్టు అభిప్రాయపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.


రూ.50వేలు ఫైన్..

విజయ్‌బాబు పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు ఆయనకు రూ.50 వేల జరిమానా విధిస్తూ.. యాభై వేల రూపాయల జరిమానాను లీగల్ సర్వీసెస్ అథారిటీలో నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. అంధులు, బధిరుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అభ్యంతరకర భాష వాడుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి కామెంట్లు ధర్మ బద్దంగా ఉండే వారిని కించ పరిచే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రణాళిక బద్దంగా ఇటువంటి కామెంట్లు పెట్టడం పట్ల కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికలను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటామంటే చట్టం ఒప్పుకోదని, న్యాయ పరంగా ఇది నేరం అవుతుందని హైకోర్టు హెచ్చరించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 29 , 2024 | 01:54 PM