ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ayyannapatrudu : వైసీపీ పాలనలో నష్టపోయిన ఏపీని అభివృద్ధి చేసుకోవాలి

ABN, Publish Date - Aug 15 , 2024 | 01:36 PM

వైసీపీ పాలనలో నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సూచించారు.

Ayyannapatrudu

అమరావతి: వైసీపీ పాలనలో నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సూచించారు. అమరావతిలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. గురువారం నాడు అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ప్రజా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.


ఇప్పుడు మనం ఆనందంగా స్వాతంత్య్రం జరుపుకుంటున్నామంటే పూర్వం ఎందరో పెద్దల ప్రాణ త్యాగ ఫలితమేనని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగడానికి వారి పాత్ర ఎంతో ఉందని చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.


అన్నా క్యాంటీన్ ప్రారంభం..

మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడ మునిసిపల్ పార్క్‌లో ఉన్న ‘అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకుని ‘అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అన్నాక్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం స్వయంగా చంద్రబాబు దంపతులు భోజనాన్ని వడ్డించారు. ఆపై సీఎం దంపతులు సైతం టోకెన్ తీసుకుని మరీ అక్కడే భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు రూ.5లకే ఆహారాన్ని అందిస్తారు.

Updated Date - Aug 15 , 2024 | 01:41 PM

Advertising
Advertising
<