పెట్టుబడులపై నేడు భారీ ప్రకటన
ABN, Publish Date - Oct 09 , 2024 | 04:26 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ మంగళవారం ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు.
ముంబైలో ఏపీ మంత్రి నారా లోకేశ్ బిజీ బిజీ
టాటా సన్స్ చైర్మన్‌తో భేటీ
హీరానందానీ డైరెక్టర్‌తో సమావేశం
అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ మంగళవారం ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశం అయ్యారు. బుధవారం భారీ ప్రకటన వెలువడనుందని, వేచి చూడాలని లోకేశ్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. గత నెలలో అమరావతిలో చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు.
కీలక ప్రకటన
రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. ఈ అంశంపై బుధవారం కీలక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. ఇంకోవైపు.. హీరానందానీ సంస్థల డైరెక్టర్ హర్ష్ హీరానందానీతో సమావేశం అయ్యానని నారా లోకేశ్ ప్రకటించారు. రాయలసీమలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు, విశాఖలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌లకు ఉన్న అవకాశాలపై చర్చించానని లోకేశ్ పేర్కొన్నారు.
Updated Date - Oct 09 , 2024 | 08:11 AM