ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: తిరుమల పవిత్రతకు వైసీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తుంది: బుచ్చి రాంప్రసాద్

ABN, Publish Date - Feb 25 , 2024 | 05:41 PM

తిరుమల పవిత్రతకు వైసీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తుందని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ (Buchi Ramprasad) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దేవాలయాలు, పూజారులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.

అమరావతి: తిరుమల పవిత్రతకు వైసీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తుందని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ (Buchi Ramprasad) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దేవాలయాలు, పూజారులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తిరుమలలో కైంకర్యాలు సంక్రమంగా జరగడం లేదని రమణ దీక్షితులు స్టేట్‌మెంట్ ఇస్తే ఆయనపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టిందని విరుచుకుపడ్డారు. రమణ దీక్షితులను బెదిరించి, భయ పెట్టి తాను ఆ మాటలు అనలేదని ఆయనతో చెప్పించారని అన్నారు.

రమణ దీక్షితులు ఎన్ని ఆరోపణలు చేసినా తిరుమల ప్రతిష్ఠతకు ఎలాంటి భంగం కలగ కూడదనే మంచి మనస్సుతో రమణ దీక్షితులపై గత టీడీపీ ప్రభుత్వం కేసు పెట్టలేదని గుర్తుచేశారు. టీటీడీ, మానస్ ట్రస్ట్ ఆస్తులపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై జగన్ రెడ్డికి లేదని ధ్వజమెత్తారు. అన్యమతస్తులకు ప్రధాన బాధ్యతలు అప్పగించి తిరుమల సాంప్రదాయాలను మంటగలిపారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో హిందూ మతాన్ని గౌరవించే, పరిరక్షించే చంద్రబాబుకు ప్రజలు ఓటేసి జగనాసురుడిని రాష్ట్రం నుంచి తరిమేద్దామని బుచ్చి రాంప్రసాద్ హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 25 , 2024 | 05:41 PM

Advertising
Advertising