ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP politics: కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో కొంతమంది ఉన్నతాధికారుల్లో గుబులు..

ABN, Publish Date - Jun 05 , 2024 | 08:05 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ మెుదలైంది. ఇప్పటికే సీఐడీ చీఫ్ సంజయ్(CID Chief Sanjay) సెలవు(Leave) పెట్టి అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. జగన్ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై తప్పుడు కేసులు నమోదు చేయడంలో సంజయ్ కీలక పాత్ర వహించారు.

CID Chief Sanjay

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ మెుదలైంది. ఇప్పటికే సీఐడీ చీఫ్ సంజయ్(CID Chief Sanjay) సెలవు(Leave) పెట్టి అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. జగన్ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై తప్పుడు కేసులు నమోదు చేయడంలో సంజయ్ కీలక పాత్ర వహించారు. ఇవాళ్టి నుంచి జులై 3వరకు వ్యక్తిగత కారణాలతో సంజయ్ సెలవు తీసుకున్నారు. అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా.. వెంటనే అనుమతి మంజూరు చేస్తూ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండగా ఆయన విదేశాలకు వెళ్లడంపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు.


ఇక మరో అధికారి హేమచంద్రారెడ్డి(Hemachandra Reddy).. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుకి పంపారు. జగన్ ప్రభుత్వం మారనున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 19వరకు మెడికల్ లీవ్ తీసుకున్నారు. నిన్న(జూన్ 4న) ఫలితాలు చూసిన వెంటనే ప్రభుత్వం మారిపోవడం ఖాయమని కీలక దస్త్రాలను మాయం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. మాయం చేసిన దస్తాలను ముక్కలుగా కట్ చేసి కవర్‌లో తీసుకెళ్లినట్లు సమాచారం. మరికొన్ని ఫైళ్లను సైతం ముక్కలు ముక్కలు చేసి ఆఫీస్ డస్ట్ బిన్‌లో వేసినట్లు తెలుస్తోంది.


వైసీపీ ఘోర పరాజయం అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే భయంతో వారిలో గుబులు నెలకొంది.

For more Andhrapradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 08:23 AM

Advertising
Advertising