ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Oct 26 , 2024 | 12:18 PM

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు.

AP CM Chandrababu Naidu

అమరావతి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రూ.100 కట్టి సీఎం చేతుల మీదుగా మెుదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలని శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వందల, వేల మంది కార్యకర్తల కృషి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ పార్టీ సేవలు అందించగలుగుతుందని అన్నారు. ఆపద సమయంలో వారిని ఏ విధంగా ఆదుకుంటామో చేసి చూపిస్తామని సీఎం చెప్పారు. పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు, నేతలు వివిధ స్థాయిల్లో కష్టపడి పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పోరాడి అనేక కేసులు పెట్టించుకున్నారని, జైలుకు వెళ్లారని, ఆస్తులు పోగొట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు. అలాంటి వారికి కచ్చితంగా టీడీపీ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన పలువురు కార్యకర్తలతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. గతంలో ఇన్స్యూరెన్స్ రాని 73 మందికి రూ.2లక్షల చొప్పున చంద్రబాబు అందించారు.


ఈ మేరకు నేడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. రూ.100లు కట్టి సభ్యత్వం తీసుకుంచే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుంది. రూ.లక్ష కడితే పార్టీలో శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. ప్రమాదవశాత్తూ చనిపోతే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు తక్షణసాయం అందజేస్తారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్థికసాయం అందిస్తారు.


మరోవైపు కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూ.లక్ష కట్టి మంత్రి భరత్ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సభ్యత్వం తీసుకున్న వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయని, ఆపద సమయంలో పార్టీ అండగా నిలబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Tirupati: నేడే జాతీయ హిందూ ధార్మిక సదస్సు.. పలు తీర్మానాలు చేయనున్న స్వామీజీలు..

Chandrababu : తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదు

Updated Date - Oct 26 , 2024 | 01:33 PM