ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Aug 05 , 2024 | 01:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది.

AP CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా వచ్చే వందరోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." ఏపీలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలి. దీనికి డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లో భారీఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దాం.


ఫుడ్ హ్యాబిట్స్ మారుతుంటే ప్రోడెక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. 20లక్షల హెక్టారుల్లో 20లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం దిశగా ముందుకు వెళ్తున్నాం. హై ప్రోటీన్ ప్యాడీకి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వ్యవహరించాలి. ఎక్కడికక్కడ భూసార పరీక్షలు చేయాలి. ప్రతి రంగంలోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఫైబర్ నెట్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లారిటీ లేదు" అని చెప్పారు.

Updated Date - Aug 05 , 2024 | 01:34 PM

Advertising
Advertising
<