AP Sachivalayam: ఏపీ సచివాలయంలో ఈ-ఆఫీస్‌ను స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..
ABN, Publish Date - Jun 05 , 2024 | 02:41 PM
ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Sachivalayam)లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ-ఆఫీస్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసి లాగిన్ ఐడీలు క్లోజ్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Sachivalayam)లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ-ఆఫీస్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసి లాగిన్ ఐడీలు క్లోజ్ చేశారు. సీఎం కార్యాలయానికి చెందిన ఫైళ్లు ఈ-ఆఫీస్ నుంచి మాయం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు అందిన వెంటనే సైబర్ క్రైమ్, ఇతర పోలీస్ టీమ్‌లు రంగంలోకి దిగారు.
వారం రోజుల నుంచి జరిగిన ఫైళ్ల మూవ్మెంట్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కొన్ని శాఖల అధికారులు ఫైళ్లు చించి వేస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ హేమచంద్రారెడ్డి.. నిన్న ఫైళ్లను ముక్కలు ముక్కలుగా చింపేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ-ఆఫీస్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులను సైతం పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల నుంచి కాపాడుకునేందుకే ఫైళ్లు చింపివేస్తూ, మాయం చేస్తున్నారని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వారికి భయం పట్టుకుందన్నారు. తప్పులు బయటపడతాయని వారికి తెలుసని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
AP politics: కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో కొంతమంది ఉన్నతాధికారుల్లో గుబులు..
Crime news: పరవాడలో ఏటీఎం చోరీ.. ఎంత నగదు ఎత్తుకెళ్లారంటే..?
AP Politics: ఏపీ అసెంబ్లీ ఫలితాలపై జనసేన నేత నాగబాబు స్పందన..
Nara Lokesh: కూటమి విజయంపై నారా లోకేశ్‌కు అభినందనల వెల్లువ..
Updated Date - Jun 05 , 2024 | 02:49 PM