ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karthika masam: కార్తీక వైభవం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు ...

ABN, Publish Date - Nov 02 , 2024 | 09:33 AM

భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీకమాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో జిల్లాలో ప్రముఖ శివాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శనివారం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

నంద్యాల : భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీకమాసం నేటి నుంచి ప్రారంభమైంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని వేలాదిమంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజామున 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిరంతర దర్శనం కల్పించారు. ఈసందర్భంగా ప్రధాన ఆలయాలను భక్తులు దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంటున్నారు. మహిళ భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోయాయి.

శ్రీశైలం మహాక్షేత్రంలో

శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందు కోసం శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయాలను సర్వాంగ సుందరంగా ఆలయ అధికారులు అలంకరించారు. కార్తీకమాసంలో క్షేత్రానికి తరలి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అభిషేకాలను నిలిపివేశారు. అదేవిధంగా కార్తీక సోమవారం, ఏకాదశి, సెలవురోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పిం చేందుకు దేవస్థానం అధికారులు కార్తీక మాసమంతా స్వామివారి గర్భాలయ ఆర్జిత అభిషేకాలను పూర్తిగా నిలిపివేశారు. సెలవు, పర్వదినాలు, తదితర రద్దీ రోజులు మొత్తం 16 రోజులపాటు స్వామివారి స్పర్శదర్శనం, సామూహిక అభిషేకాలను నిలుపుదల చేశారు.


ఆ సమయంలో భక్తులందరికీ అలంకరణ దర్శనం మాత్రమే ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాధారణ రోజుల్లో మూడు విడతలుగా ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, 12:30 నుంచి 1:30 వరకు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు స్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తారు. భక్తులు స్వామివారి స్పర్శదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. నవంబర్ నెల టికెట్లు దేవస్థానం వెబ్‌సైట్‌ డబ్ల్యూ.డబ్ల్యూ .డబ్ల్యూ. శ్రీశైలదేవస్థానం.ఓఆర్‌జిలో అందుబాటులో ఉన్నాయి. కార్తీకమాసం మొదటిరోజు కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు మూడుగంటల సమయం పడుతోంది.


వేకువజాము నుంచే భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. కార్తీకమాసం మొదటిరోజు కావడంతో భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది.


భీమవరం పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు..

పశ్చిమగోదావరి: భీమవరం పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. కార్తీకదీపాలను భక్తులు వెలిగిస్తున్నారు.

పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో..

పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం చేశారు. కార్తీక మాసం మొదటి శనివారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.


వశిష్ట గోదావరిలో పుణ్య స్థానాలు

కార్తీక మాసం ప్రారంభం కావడంతో నర్సాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్థానాలు చేస్తున్నారు.గోదావరిలో భక్తులు పూజలు చేసి కార్తీకదీపాలు విడిచిపెట్టారు.

గోష్పాద క్షేత్రంలో ...

తూర్పుగోదావరి జిల్లా( కొవ్వూరు): తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. శివనామస్మరణతో శ్రీ బాల త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామి ఆలయం మార్మోగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

పాదగయా క్షేత్రంలో..

కాకినాడ: కార్తీక మాసం సందర్భంగా పిఠాపురం పాదగయా క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పాదగయ పుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అరటి డొప్పలపై పాడ్యమి దీపాలు వెలిగించి మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలను భక్తులు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 11:16 AM