CM Chandrababu: జోక్యం చేసుకోవద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్
ABN, Publish Date - Jul 16 , 2024 | 03:33 PM
ఉచిత ఇసుక రీచుల విధానంలో జోక్యం చేసుకోవద్దని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇన్వాల్వ్ అయి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఇసుక రీచుల విషయంలో ఎమ్మెల్యేలు కూడా కల్పించుకోకూడదని తేల్చి చెప్పారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులు అన్ని అందుబాటులోకి వస్తాయని వివరించారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డంప్ యార్డుల్లో ఉందన్నారు.
అమరావతి: ఉచిత ఇసుక రీచుల విధానంలో జోక్యం చేసుకోవద్దని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు (cm chandrababu naidu) స్పష్టం చేశారు. ఇన్వాల్వ్ అయి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఇసుక రీచుల విషయంలో ఎమ్మెల్యేలు కూడా కల్పించుకోకూడదని తేల్చి చెప్పారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులు అన్ని అందుబాటులోకి వస్తాయని వివరించారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డంప్ యార్డుల్లో ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మంచి చేయాలనే ఢిల్లీ వెళ్తున్నామని వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
5 రోజులు సమావేశాలు
ఈ నెల 22వ తేదీ నుంచి 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ‘తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతాం. ఈ చట్టం ఎంత ప్రమాదకరమో అనే విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలి. పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తాం. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.1600 కోట్ల రుణం తీసుకొచ్చి వెయ్యి కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చారు. మిగిలిన రూ.600 కోట్లకు సంబంధించి వివరాలు లేవు. ధాన్యం సేకరణపై కూడా చర్చ జరగాలి. పౌర సరఫరాల కార్పొరేషన్‌తోపాటు వ్యవసాయ శాఖ సేకరణ అంశంపై చర్చిస్తాం. సమగ్ర వివరాలు రెండు రోజుల్లో ఇవ్వాలని అధికారులను ఆదేశించా. అధికారులు నిదానంగా ఉన్నారు. క్షేత్రస్థాయి సమాచారం వేగంగా తీసుకురావాలి అని’ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
AP Cabinet Meet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయం
గనులు, భూ కబ్జాలపై..!
‘గనులు, భూకబ్జా అంశంపై కమిటీ వేయాలని ఆలోచిస్తున్నాం. ఏ విషయంపై తొందరపడి మాట్లాడొద్దు. కాకినాడలో ద్వారంపూడి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, మరో కుమారుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్. ముగ్గురూ కలిసి బియ్యం రీసైక్లింగ్ చేసి కిలో రూ.43కు ఎగుమతి చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. వచ్చే మంత్రివర్గం సమావేశం వరకు ఏం చేద్దాం అనే దానిపై విధి విధానాలతో రావాలి. సీనియర్ మంత్రులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను ఈ రోజు వరకు కొత్త విషయాలు నేర్చుకుంటా. నాకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు, సబ్జెక్ట్ పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు, అందుకు తగ్గట్టు మనం పనిచేయాలి. ఆగస్టు 1వ తేదీన ఇళ్ల వద్ద ఫించన్ పంపిణీలో పాల్గొందాం అని’ సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఏటా రూ.35 వేల కోట్ల ఖర్చు
‘వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా 35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మనం వెళ్లి ఇస్తే బాగుంటుంది. అన్న కాంటీన్లు వంద ఆగస్టులో ప్రారంభిస్తాం. ఆర్ధిక సమస్యలు ఉన్నాయి, ఇన్నొవేటివ్‌గా ఆలోచించి ముందుకెళదాం. నెల రోజుల మంత్రుల పని తీరుపై చర్చ. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉంది. ఆ విషయం తెలుసుకొని పనిచేయండి. హెచ్‌వోడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతీ నెల సమీక్ష చేయాలని మంత్రులకు ఆదేశం. తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలని మంత్రులను ఆదేశించా. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన. పార్టీ కార్యాలయంలో కూడా మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టీకరణ. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు సూచన. మంత్రులు ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా.. సమన్వయంతో పనిచేయాలి అని’ సీఎం చంద్రబాబు సూచించారు.
ఇవి కూడా చదవండి
అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం
For AP News and Telugu News
Updated Date - Jul 16 , 2024 | 04:15 PM