Alapati Raja: జగన్ గుంటూరు పర్యటనపై ఆలపాటి రాజా షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Oct 23 , 2024 | 03:02 PM
Andhrapradesh: గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు. జగన్ జులం ప్రదర్శించాలని చూస్తూ కుదరదు అంటూ ఆలపాటి రాజా వ్యాఖ్యలు చేశారు. శవ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు.
గుంటూరు, అక్టోబర్ 23: ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఏనాడైనా పరామర్శలకు వెళ్లారా అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై మాజీ మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై కనీసం నోరు మెదపలేదని విమర్శించారు. ‘‘అధికారంలోకి వచ్చాక నీ బాబాయి హత్య గురించి నోరు విప్పలేదు. నేరపూరిత ఆలోచనలతో కూడిన పాలన జగన్ ఐదేళ్లు చేశారు. దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు ఎప్పుడైనా జగన్ పరామర్శించారా. పరామర్శల పేరుతో రాజకీయంగా మాపై బురజ జల్లుతున్నారు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..
వరద బాధితులకు జగన్ ప్రకటించిన రూ.కోటి సాయం ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మరి ఇప్పుడైనా ప్రకటించిన రూ.10 లక్షల సాయం జగన్ ఇస్తారా అంటూ నిలదీశారు. సహనపై దాడి చేసిన నవీన్ తల్లి తమ కుటుంబం వైసీపీలో ఉందని చెప్పిందన్నారు. కానీ జగన్ మాత్రం నిందితుడిని టీడీపీ వ్యక్తి అని అసత్యాలు చెప్పారన్నారు. ఎవరితోనో ఫొటోలు దిగితే తమ పార్టీ వాళ్లు అయిపోతారా అంటూ మండిపడ్డారు. రౌడీయుజాన్ని, అరాచకాలు, మహిళలపై దాడులకు పాల్పడిన వారిని క్షమించమమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి జులుం ప్రదర్శించాలని చూస్తే కుదరదంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజా స్పష్టం చేశారు.
Jagan: ఏపీలో లా అండ్ అర్డర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
ఈసారి చూస్తూ ఊరుకోం: ఎమ్మెల్యే గల్లా మాధవి
వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు నెలలకే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ శవం దొరికితే అక్కడకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పిచ్చోడు చేతిలో రాయి ఉన్నట్లు కూటమి ప్రభుత్వంపై విమర్శిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలు, ఆడపిల్లల భద్రత విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. హోంమంత్రి నేరుగా వెళ్లి బాధితులను పరామర్శించి పరిహారం అందిస్తున్నారని తెలిపారు. ‘‘ప్రభుత్వంపై బురద జల్లటం కోసమే మీతో పాటు మీ పార్టీ నేతలు పని చేస్తున్నారు.11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఏం చేస్తున్నారో చెప్పాలి. దేవుడు పై నుంచి చూస్తున్నారని జగన్ అంటారు... భగవంతుడు చూశారు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు’’ అని అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా శవాల చుట్టూ రాజకీయం చేయటం హాస్యాస్పదమన్నారు. జగన్ ఈసారి శవ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
CM Chandrababu: ప్రేమోన్మాదానికి బలైన విద్యార్థిని కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ
Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ రెండు రోజులు జాగ్రత్త..
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 23 , 2024 | 03:08 PM