Drugs Case: గుంటూరులో డ్రగ్స్ కేసు కలకలం...
ABN, Publish Date - Aug 13 , 2024 | 12:40 PM
Andhrapradesh: గుంటూరులో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. మస్తానయ్య దర్గా ధర్తకర్త రావి రామ్మోహన్ రావు కొడుకు రావి మస్తాన్ సాయిని సెబ్ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయితో కలసి సుబానీ హోటల్ నిర్వాహకులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ కేసులో సుభానీ హోటల్ యజమాని ఇద్దరు కొడుకులు నాగూర్ షరీఫ్ , ఖాజా మొయినుద్దీన్‌లు అరెస్టు అయ్యారు.
గుంటూరు, ఆగస్టు 13: గుంటూరులో డ్రగ్స్ కేసు (Drugs Case) కలకలం రేపుతోంది. మస్తానయ్య దర్గా ధర్తకర్త రావి రామ్మోహన్ రావు కొడుకు రావి మస్తాన్ సాయిని సెబ్ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయితో కలసి సుబానీ హోటల్ నిర్వాహకులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ కేసులో సుభానీ హోటల్ యజమాని ఇద్దరు కొడుకులు నాగూర్ షరీఫ్ , ఖాజా మొయినుద్దీన్‌లు అరెస్టు అయ్యారు. మస్తాన్ సాయి, సుబానీ హోటల్ తనయులు గతంలో పలు కేసుల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మి టిఫిన్స్ , పల్లెటూరి దోసే హోటల్స్ నిర్వాహకులతో కలసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే అన్న కొడుకు గత ఐదేళ్లుగా డ్రగ్స్ ముఠాకు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసుతో మస్తాన్ సాయి మరోసారి వెలుగులోకి వచ్చారు.
Doctors Protest: భద్రత లేకుండా.. డ్యూటీ చేయం.. వైద్యుల నిరసనలతో దేశవ్యాప్తంగా ఓపీడీ సేవల్లో అంతరాయం
కాగా.. లావణ్య, సినీనటుడు రాజ్‌తరుణ్ కేసులో డ్రగ్స్ వ్యవహారం నిజమేనని తేలింది. వారికి మాదకద్రవ్యం సరఫరా చేసిన కీలక నిందితుడిని విజయవాడ సెబ్ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వాస్తవానికి ఒక కేసులో ఈ నిందితుడిని అరెస్టు చేస్తే ఇందులోకి లావణ్య, రాజ్‌తరుణ్ ఎపిసోడ్ వచ్చి చేరింది. రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం ఉన్నదని, ఆ పరిచయంతోనే రాజ్‌తరుణ్, లావణ్యలకు డ్రగ్ సరఫరా చేశానని ఈ కేసులో నిందితుడు రావి సాయిమస్తాన్‌రావు(మస్తాన్‌సాయి) అంగీకరించినట్టు సమాచారం. సాయిమస్తాన్‌రావును సెబ్ నిఘా అధికారులు సోమవారం గుంటూరులో అరెస్టుచేసి విజయవాడకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం, గుంటూరు నగరపాలెం ప్రాంతానికి చెందిన రావి సాయిమస్తాన్‌రావు (35) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం సాయిమస్తాన్‌రావు హిమాచల్‌ప్రదేశ్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి అతడికి పరిచయమయ్యారు. అప్పటికే ఆ స్నేహితుడు డ్రగ్స్ లావాదేవీల్లో ఉన్నారు. ఢిల్లీలోని వికాస్‌పురిలో తనకు డ్రగ్స్ విక్రయించే వ్యక్తిని మస్తాన్‌రావుకు పరిచయం చేశాడు. అప్పటినుంచి సాయి మస్తాన్‌రావు ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ను గుంటూరుకు తెప్పించుకుంటున్నాడు. వాటితో స్నేహితులతో పార్టీలు చేసుకుంటున్నాడు.
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
మరికొంత డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో పరిచయస్థులకు విక్రయిస్తున్నాడు. గుంటూరులో హాల్టింగ్ డ్రైవర్‌గా పనిచేసే యనమల గోపీచంద్‌ను డ్రగ్స్ కోసం గత జూన్‌లో ఢిల్లీ పంపించాడు. ఈ సరుకును విజయవాడలో తీసుకోవడానికి గుంటూరులోని సుభాని హోటల్ యజమాని కుమారులు నాగూర్ షరీఫ్, ఖాజా మొహిద్దీన్‌కు పురమాయించాడు. ఢిల్లీ నుంచి తీసుకువస్తున్న డ్రగ్‌ను తీసుకోవడానికి ఈ ఇద్దరూ జూన్ 30వ తేదీన విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఢిల్లీ నుంచి డ్రగ్ వస్తున్న సమాచారం సెబ్ పోలీసులకు అప్పటికే అందింది. వారు రైల్వేస్టేషన్ వద్ద నిఘా పెట్టి గోపీచంద్, షరీష్, మొహిద్దీన్‌తోపాటు వారు వేచి ఉన్న కారు డ్రైవర్ ఎడ్ల క్రాంతిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం ఈ నలుగురూ నెల్లూరు జైలులో ఉన్నారు. వీరిని విచారించగా, సాయిమస్తాన్‌రావు పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో అతడ్ని ఏ5గా చేర్చారు.
ఇవి కూడా చదవండి...
AP News: శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం
AP News: మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అధికారుల ప్రయత్నం ఫలించేనా?
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 13 , 2024 | 12:44 PM