ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Govt: ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

ABN, Publish Date - Jan 26 , 2024 | 08:33 PM

ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీలు అయ్యారు. 92 మంది మున్సిపల్ కమిషనర్లను ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు బదిలీ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీవోను స్పెషల్ ఛీప్ సెక్రటరీ శ్రీలక్ష్మి జారీ చేశారు.

అమరావతి: ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. 92 మంది మున్సిపల్ కమిషనర్లను ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు బదిలీ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీవోను స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి జారీ చేశారు. ఈ బదిలీలతో ఏపీ ప్రభుత్వ తీరు మరోసారి చర్చానీయాంశం అయింది.

మూడేళ్లకు పైగా, సొంత జిల్లాలో ఉంటే..

ఎన్నికల వేళ ఎన్నికల ప్రక్రియతో నేరుగా సంబంధం ఉన్న అధికారుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లకు పైగా, సొంత జిల్లాలో, ప్రమోషన్ పొంది అక్కడే పోస్టింగ్‌లలో ఉన్న మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు బదిలీలు చేస్తున్నట్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 92 మంది అధికారులను బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలోని అధికారుల బదిలీల కోసం ప్రత్యేక జీవో ఆర్టీ నెంబర్ 106ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

ప్రత్యేక జీవో

కాగా.. ఏపీలో ఎన్నికల బదిలీలు మొదలయ్యాయి. లోక్ సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారుల బదిలీలను చేపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 105ను జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలతో నేరుగా సంబంధం ఉన్న అధికారుల బదిలీలను చేపడుతున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Jan 26 , 2024 | 09:33 PM

Advertising
Advertising