ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IAS Rajamouli: సీఎం పేషీలోకి మరో సీనియర్ ఐఏఎస్ అధికారి..

ABN, Publish Date - Jul 19 , 2024 | 08:26 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పేషీలోకి మరో కీలక ఐఏఎస్ అధికారి చేరిపోయారు. సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి(IAS Rajamouli)ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన ఐఏఎస్ రాజమౌళికి వెంటనే పోస్టింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయణ్ని రిలీవ్ చేసింది.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పేషీలోకి మరో కీలక ఐఏఎస్ అధికారి చేరిపోయారు. సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి(IAS Rajamouli)ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన ఐఏఎస్ రాజమౌళికి వెంటనే పోస్టింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయణ్ని రిలీవ్ చేసింది. డిప్యుటేషన్‌కు అపాయింట్‌మెంట్స్ కమిటీ అనుమతి ఇచ్చిన వెంటనే రాజమౌళిని విధుల్లో చేరాలంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఐఏఎస్ రాజమౌళి 2014-19 మధ్య కూడా రాష్ట్రంలో పని చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఏపీ సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కూడా రాబోయే మూడేళ్లు ఆయన సీఎంవోలోనే విధులు నిర్వహించనున్నారు. ఆయన రాకతో సీఎంవో కీలక అధికారుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రస్తుతం సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా విధులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:

CM Chandrababu: 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు చంద్రబాబు శ్రీకారం..

Updated Date - Jul 19 , 2024 | 08:27 PM

Advertising
Advertising
<