ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: పవన్‌తో కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ రమేశ్ బాబు భేటీ..

ABN, Publish Date - Jul 23 , 2024 | 09:28 PM

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌తో కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ, సీఈవో బి.రమేశ్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరూర్ వైశ్యా బ్యాంకు తరఫున ఏపీలోని గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎంకు రమేశ్ బాబు తెలిపారు.

అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌తో కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ, సీఈవో బి.రమేశ్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరూర్ వైశ్యా బ్యాంకు తరఫున ఏపీలోని గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎంకు రమేశ్ బాబు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులోని కరూర్ జిల్లా మనవాడి గ్రామంలో తమ సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను పవన్‌కు బ్యాంకు ఎండీ వివరించారు. జలవనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, గ్రామ ప్రజలకు పాడి పరిశ్రమలో చేయూత, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సోలార్ విద్యుత్ ద్వారా ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎంకి ఆయన వివరించారు. ఏపీలోనూ అలాంటి పనులు చేపట్టేందుకు ముందుకు వస్తామని చెప్పారు.


కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ, సీఈవో ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ గ్రామాల అభివృద్ధిలో ప్రముఖ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రవాస భారతీయుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఆయనకు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని రమేశ్ బాబుకు పవన్ విజ్ఞప్తి చేశారు. సంస్థలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికులకూ బాధ్యత కల్పించే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు పవన్ ఆయనకు వివరించారు. పల్లెల అభివృద్ధి కోసం ముందుకు వచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో కరూర్ వైశ్యా బ్యాంకు ప్రతినిధులు ఎన్.మురళీకృష్ణ, కె.వి.ఎస్. ప్రసాద్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

Minister Gottipati: విద్యుత్ షాక్ ఘటనపై మంత్రి గొట్టిపాటి తీవ్ర దిగ్భ్రాంతి..

Minister Narayana: విశాఖ‌ అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష..

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

Updated Date - Jul 23 , 2024 | 09:30 PM

Advertising
Advertising
<