AP News: జగన్‌పై మంత్రి కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 25 , 2024 | 09:58 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ పరువు తీసే పనులు జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లి, తల్లికే అన్యాయం చేశాడని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు.
కర్నూలు: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ పరువు తీసే పనులు జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లి, తల్లికే అన్యాయం చేశాడని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పరిపాలన వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని ప్రజలు భరించారని చెప్పారు.
హడ్కో చైర్మన్ ఇవాళ సీఎం చంద్రబాబును కలిశారని తెలిపారు. పీఎంఏవై-2 ద్వారా ప్రతీ పేదవాడికి ఇళ్ల విషయంలో ఎలాంటి నిబంధనలు లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని మంత్రి కొలుసు పార్ధసారధి గుర్తుచేశారు.
పైప్ లైన్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ:
నగర పాలకలోని వాటర్ వర్క్స్, సుంకేసుల నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు చేపడుతున్న పైప్ లైన్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు, రోడ్ల విస్తరణ సిద్ధం చేయాలని అన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదని చెప్పారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో మినిట్స్ బుక్ మెయింటేయిన్ చేయాలని అన్నారు.. రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించినా నగరానికి తాగునీటి సమస్య తీరదని అన్నారు. నదులు పక్కనే ఉన్న కూడా తాగునీటి సమస్య రావడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 2022కి ముందు నగర పాలక నిధులు ఇక్కడే ఉండేవని అన్నారు.
అయితే 2022 తర్వాత ఈ నిధులు ప్రభుత్వానికి వెళ్లే విధంగా జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. దీంతో జీతాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. పాతవిధానాన్ని కొనసాగించే విధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచిస్తున్నారని అన్నారు. నగరంలో ప్యాచ్ వర్క్‌లు, కాలువల్లో పూడికతీత పనులు శరవేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు.
హడ్కో చైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ భేటీ
అమరావతి: ఏపీ సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌తో హడ్కో చైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించారు. ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ రంగ ప్రాజెక్టులపై మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ విద్యుత్ రంగం కొత్తపుంతలు తొక్కుతుందని సంజయ్ కుల్ శ్రేష్ఠ ప్రశంసించారు.
డిస్కంలకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు సంజయ్ సుముఖం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్ అందిచడానికి క్షేత్రస్థాయిలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి హడ్కో ఆర్థిక సాయం చేస్తుందని సంజయ్ కుల్ శ్రేష్ఠ మాటిచ్చారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న విద్యుత్ రంగం ప్రాజెక్టులకు ఫండింగ్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంజయ్ తెలిపారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడానికి హడ్కో ముందుకు వచ్చిందని సంజయ్ కుల్ శ్రేష్ఠ వెల్లడించారు.
Updated Date - Oct 25 , 2024 | 09:58 PM